Viral Video: Groom Fails To Find Horse For Baarat, Sits On Donkey Instead. Watch
mictv telugu

గుర్రం దొరకలేదని గాడిదపై ఊరేగిన పెళ్లికొడుకు

October 31, 2022

పెళ్లి వేడుకల్లో బరాత్ సందర్భంగా వరుడు గుర్రంపై రావడం సాంప్రదాయం. ఊరేగింపుతో పెళ్లి మండపానికి చేరేకునే ఈ బరాత్‌ను కొన్ని ప్రాంతాల్లో చాలా గౌరవప్రదంగా భావిస్తారు. అయితే అలా ఊరేగింపుల్లో చాలా విచిత్రాలు జరిగే అవకాశాలు ఉంటాయి. చాలాసార్లు గుర్రాలు బెదిరిపోయి.. పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓ వరుడు గుర్రం.. కాదు గాడిదపై ఊరేగాడు. రోటీన్‌కు భిన్నంగా ఇలా చేశాడనుకుంటే.. పొరపాటే. గుర్రం దొరకక.. గాడిద మీద ఊరేగాడు. అంటే గుర్రం లేక.. గాడిదతో అడ్జస్ట్ అయ్యాడు. గుర్రం అందుబాటులో లేకపోవడంతో ఒక పెళ్లి కొడుకు గాడిదపై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాడు. గాడిద మీద వెళ్లి.. మిగతా తంతు మొత్తం చాలా సంప్రదాయంగానే చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్ష‌మైంది. పైగా “గుర్రం లేకపోతే ఏం గాడిద ఉందిగా” అని దానికి క్యాప్షన్ పెట్టారు.

ఈ వీడియోలో వరుడు గాడిదపై కూర్చొని ఉంటాడు. అతడి బంధువులు దాని ముందు డ్యాన్సులు చేస్తారు. మహిళలు కూడా హారతులు ఇస్తారు. అనంతరం వరుడు ఆ గాడిదపై ఊరుగుతూ పెళ్లి మండపానికి చేరుకుంటాడు. కాగా, బారత్‌ సందర్భంగా వరుడు గాడిదపై ఊరేగిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్లు చేశారు. లాఫింగ్‌ ఇమోజీలతో పాటు పలు జోకులు వేశారు. ‘ఇది నా స్నేహితుడి పెళ్లి’ అని ఒకరు కామెంట్‌ చేశారు. మరికొందరు ఆ వరుడికి తమ అభినందనలు తెలిపారు.