Viral Video: Kerala Bride Walks On Road Full Of Potholes For Photoshoot
mictv telugu

బురద రోడ్లపై పెళ్లి కూతురి ఫోటో షూట్.. సోషల్ మీడియాలో వైరల్

September 22, 2022

ఈ కాలం యువత తమ పెళ్లిళ్లని కలకాలం గుర్తుండేలా ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, రిసెప్షన్.. అంటూ హెచ్‌డీ కెమెరాల్లో బంధిస్తున్నారు. మంచి మంచి లోకేషన్లతో, ఖరీదైన డ్రస్సులు, నగలతో ఓ చిన్న సైజు సినిమా మాదిరిగా షూట్‌లో పాల్గొంటున్నారు. అయితే ఓ పెళ్లి కూతురు.. తన మ్యారేజ్‌కు సామాజిక కోణాన్ని యాడ్ చేసింది. ఓ చిన్న ఫోటో షూట్‌తో.. ఓవర్ నైట్ ఇండియా వైడ్‌గా సెలబ్రిటీ అయిపోయింది. ఆమె చేసిన పనికి నెటిజెన్స్‌ మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

కేరళకు చెందిన ఓ అమ్మాయి తన ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం.. అందరిలా కాకుండా కాస్త డిఫ్రెంట్‌గా గుంతల రోడ్లను లోకేషన్‌గా ఎంచుకుంది. పట్టుచీరలో, ఒంటి నిండా నగలు పెట్టుకుని, పెళ్లికూతురుగా ముస్తాబై.. వర్షం నీరు నిలిచిన రోడ్డుపై నవ్వుకుంటూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. కాసేపట్లో పెళ్లి ఉందనగా కళ్యాణమండపం దగ్గరే ఉన్న రోడ్డుపై ఇలా షూట్ చేసింది. ఆమె ఫోటోలు, వీడియోను ఆరో వెడ్డింగ్ కంపెనీ అనే సంస్థ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ప్రీ వెడ్డింగ్ వీడియో ఓవరాల్ ఇండియాలో వైరల్ అయిపోయింది. అప్‌లోడ్ అయిన కొన్ని గంటల్లోనే 50 లక్షలకు పైగా వ్యూస్ రావడమే కాదు వాటి సంఖ్య గంట గంటకూ పెరుగుతూ వస్తోంది.

తమ ప్రాంతంలో రోడ్లు సరిగా లేని పరిస్థితి, చిన్న వర్షానికే అంతా బురదగా మారుతున్న దుస్థితిని చూపించడం కోసం తాము ఈ పనిచేసినట్టు పెళ్లి కూతురు, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లు చెబుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఒక్క షూట్‌తో కేరళ ప్రభుత్వం పరువు గంగలో కలిసిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి కూతురు దెబ్బకు.. ప్రభుత్వ అధికారులు కళ్లు తెరుచుకుంటాయంటూ.. అమె చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. కేరళ సర్కార్ నిద్ర పోతుందని కొందరు అసలు కేరళలో ప్రభుత్వం ఉందా..? లేదా..? అంటూ మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా రోడ్లపై పడిన గుంతల్లో హ్యాపీగా చేపలు పెంచుకోవచ్చంటూ కామెంట్స్ చేస్తున్నారు.