చీరల షాపింగ్ కి వెళితే షాపులో చీర కట్టడానికి సేల్స్ మెన్ ఉంటారు. వాళ్లు చీర కట్టడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. అయితే ఒక సిక్కు సేల్స్ మెన్ సెకన్లలో చీర చుట్టిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. మొన్నటి వరకు పెండ్లిళ్ల సీజన్ అయింది. మళ్లీ కూడా సీజన్ మొదలవుతుంది. షాపింగ్ మాల్స్ అంతా కిటకిటలాడుతుంటాయి. పెండ్లికూతుళ్లు, ఇతరులు బట్టల షాపింగ్ చేస్తుంటారు. అలా చేసినప్పుడు చీరలను కట్టి చూపించడానికి సేల్స్ మెన్ లేదా ఉమెన్ అంటారు. వాళ్లు కట్టి చూపించడమూ, కట్టుకొని చూపించడమో చేస్తారు. దానివల్ల మనం మరింత పర్ఫెక్ట్ గా బట్టలను సెలెక్ట్ చేసుకుంటాం.
Bro almost made me want to buy it pic.twitter.com/QvxJIWF4ht
— Punjabi Touch (@PunjabiTouch) December 17, 2022
పాకిస్తాన్ కి చెందిన గుజరాన్వాలా అనే వ్యక్తి ట్విట్టర్ లో ఒక వీడియో షేర్ చేశాడు. ఇప్పటికే ఈ వీడియో 47వేల మంది చూశారు. అందులో ఒక సిక్కు సేల్స్ మెన్ కుర్తా, పైజామాలో ఉన్నాడు. నల్లని సిల్క్ చీరను రెండు సెకన్లలో చుట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది కూడా సరైన రీతిలో పల్లూ, చెంగులు చక్కగా ముడిచాడు. ఇతను పాకిస్తాన్లోని గలి దస్తగిర్ వాలీలోని మదినీ మార్కెట్ దగ్గర షాపులో పనిచేస్తున్నాడట. ఆన్ లైన్ లో చీరలు అమ్మేందుకు ఈ వీడియోను షేర్ చేసినట్టు తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నది. చాలామంది ‘ఇంత త్వరగా ఎలా కట్టావ్ భాయ్’అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఆడవాళ్లయితే ‘మాకెంతో అసూయగా ఉంది. మేం నిమిషాల్లో చేసే పని నువ్వు సెకన్లలో పూర్తి చేశావు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి :