Viral Video : Man falls in trap for leopard after getting in cage to catch rooster
mictv telugu

Viral Video : పులి కోసం పెట్టిన కోడికి ఆశపడి బోనులో ఇరుక్కుపోయాడు..

February 25, 2023

Viral Video : UP Man Stuck In Cage Meant For Leopard

కోడిని చోరీ చేసేందుకు వెళ్లి ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు ఓ దొంగ. ఏకంగా పులికి అమర్చిన బోనులో చిక్కాడు. బయటకు రాలేక అడ్డంగా బుక్కైపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అసలు పులి బోనుకు, కోడి దొంగతనానికి ఏంటి సంబంధం అనే కదా మీ సందేహం అయితే పూర్తి వివరాలను చూడండి.

బులంద్‌షహర్‌ జిల్లాలో గ్రామంలో ఒక చిరుత పులి సంచరిస్తున్నది. అధికారులు ఆ పులి పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో ఒక బోను ఏర్పాటు చేశారు. దానికి ఎరగా బోనులో కోడి ఉంచారు. కోడి కోసం పులి వస్తే బోనులో చిక్కుకుపోతాదన్నది అధికారల ప్లాన్. అయితే కోడి కోసం పులి రాలేదు కానీ ఓ దొంగ వచ్చి మాత్రం దొరికిపోయాడు.

బోనులో ఉంచిన కోడిపై దొంగకు మనస్సు లాగింది. దానిని కాజేయాలని భావించాడు. రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా బోను లోనికి వెళ్లి కోడి మెడను పట్టేశాడు. ఇక ఆనందంలో బయటకు రావడానికి ప్రయత్నించగా వీలుపడలేదు. బోను తలుపు మూసుకుపోవడంతో అందులోనే ఉండిపోయాడు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. దీంతో చేసేది లేక బోనులో నుంచి ఏడుస్తూ అరవడం మొదలు పెట్టాడు. రక్షించాలంటూ గోల చేశాడు. శుక్రవారం ఉదయం అతడిని గమించిన గ్రామస్తులు అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం బోను లాక్ ఓపెన్ చేసి బయటకు రప్పించారు. కోడి దొంగవేయడానికి వెళ్లానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‎గా మారింది.