Home > Featured > అందాల పోటీల్లో కుమ్ములాట.. వీడియో వైరల్

అందాల పోటీల్లో కుమ్ములాట.. వీడియో వైరల్

గతవారం అమెరికాలోని న్యూయార్క్‌ సమీపంలో ఉన్న స్టేటన్‌ ఐలాండ్‌లో జరిగిన మిస్ శ్రీలంక పోటీలు వివాదాస్పదమయ్యాయి. పోటీల అనంతరం జరిగిన పార్టీలో రెండు గ్రూపులకు చెందిన పలువురు గొడవ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. వీడియోలో కొందరు అబ్బాయిలు ఒకరినొకరు కొట్టుకుంటూ, పిడిగుద్దులు కురిపిస్తుండగా.. అమ్మాయిలు వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. మహిళలు, పురుషులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. సుమారు 300 మంది ఆ ఈవెంట్‌కు హాజరయ్యారు. అయితే గొడవకు కారణమేంటనేది మాత్రం స్పష్టంగా తెలియదు. అయితే ఈ గొడవలో అక్కడున్న పరికరాలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెండు గ్రూపులకి చెందిన కొందరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.

అమెరికాలోని స్టేటన్ ఐలాండ్‌లో ఎక్కువ సంఖ్యలో లంకేయులు నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ దీవిలోనే మిస్‌ శ్రీలంక పోటీలు నిర్వహించాలని ఆర్గనైజర్లు భావించారు. ప్రస్తుతం శ్రీలంక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆ దేశాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో స్టేట్‌ ఐలాండ్‌లో మిస్‌ శ్రీలంక పోటీలను నిర్వహించారు. అయితే పోటీలో పాల్గొన్న 14 మంది కాంటెస్టెంట్లలో ఎవరు కూడా గొడవకు దిగలేదని మిస్‌ శ్రీలంక పోటీ నిర్వాహకులు తెలిపారు. అందాల పోటీల వేళ జరిగిన ఘర్షణతో శ్రీలంక ఇమేజ్‌ దెబ్బతింటుందని కొందరు ఆరోపించారు.

Updated : 3 Nov 2022 2:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top