‘కిందకు దించండిరా బాబోయ్’ కావాలంటే రూ. 500 ఇస్తా! - MicTv.in - Telugu News
mictv telugu

‘కిందకు దించండిరా బాబోయ్’ కావాలంటే రూ. 500 ఇస్తా!

August 29, 2019

పరాగ్లయిడింగ్ సరదాగా గాల్లోకి ఎగిరి ఎంచక్కా ఎంజాయ్ చేద్దామనుకున్నాడు. కానీ భయంతో వణికిపోయి ‘ఆపండి బాబోయ్’ అంటూ మెరపెట్టుకున్నాడు. సరిగ్గా ‘నువ్వునాకు నచ్చావు’ సినిమాలో  బ్రహ్మానందం చేసినట్టుగా గగ్గోలుపెట్టాడు. ఇప్పుడు ఆ యువకుడి వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 

మనాలి వెళ్లిన విపిన్ సాహు అనే వ్యక్తి  పరాగ్లయిడింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. వెంటనే అది ప్రారంభంకావడంతోనే సెల్ఫీ తీసుకుంటూ కొంత దూరం వెళ్లాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత భయంతో అరవడం ప్రారంభించారు. ‘కిందకి దింపేయండి బాబోయ్’.. ‘ఆపండోయ్’ అంటూ మొరపెట్టుకున్నాడు. ఇదంతా అతడి సెల్ఫీ వీడియోలో రికార్డు అయింది. అయితే అతని వెంటే ఉన్న గైడ్ ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ‘వెంటనే దించేయండి ఇంకో రూ. 500 ఇస్తా’ అంటూ కోరాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు కావడంతో అది చూసిన వారంతా వెరైటీగా కామెంట్లు పెడుతున్నారు. అతనిపై మేమ్స్ చేసి ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తున్నారు. ఫుల్ ఫన్నీ వీడియో అంటూ తెగ నవ్వేసుకుంటున్నారు. మొత్తం మీద విపిన్ సాహు చేసిన పని ఇప్పుడు బ్రహ్మానందాన్ని మించిపోయిందంటున్నారు.