Viral video of the moon rising in the North Pole is computer generated
mictv telugu

సూర్యుడిని కప్పేస్తున్న చంద్రుడు- వైరల్ అవుతున్న వీడియో

February 2, 2023

 Viral video of the moon rising in the North Pole is computer generated

వింతగా ఉంటే చాలు ఎలాంటిదైనా తెగ వైరల్ అయిపోతుంది. జనాలు అది నిజమా కాదా అని కూడా తెలుసుకోకుండా షేర్ చేసేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అయిపోయింది. చంద్రుడు, సూర్యుడిని కొన్ని నిమిషాలు కప్పేస్తున్నాదంటూ వీడియో ఒకటి వచ్చింది. నార్త్ పోల్‌లో ఈ దృశ్యం కనిపిస్తోంది అంటూ అలెక్సీ పట్రేవ్ అనే వ్యక్తి మూన్ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

పట్టపగలే అలా కింద నుంచి పైకి వచ్చిన చంద్రుడు…అలా అలా కదులుతూ వెళ్ళి సూర్యుడిని కప్పేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇదీ మొత్తం వీడియో. చూడ్డానికి అద్భుతంగా ఉందీ వీడియో. అస్సలు ఏమీ తెలియని వాళ్ళైతే మెస్మరైజ్ అయిపోతారు కూడా. కానీ ఏ మాత్రం కొంచెం బుర్ర ఉపయోగించినా తెలిసిపోతుంది అది ఫేక్ వీడియో అని. ఈ వీడియోని రూపొందించిన అలెక్సీ ఒక ఉక్రేనియన్. ఇతనో కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆర్టిస్ట్. అతని టాలెంట్ అంతటినీ ఉపయోగించేసి ఇదిగో ఈ అద్భుతమైన వీడియో తయారు చేసేసాడు. ముందూ వెనుకా ఆలోచించకుండా మన జనాలు దాన్ని వైరల్ చేసేసారు.

ఇక వీడియో విషయానికి వస్తే, చంద్రుడు, సూర్యుడిని కప్పేయడం నార్త్ పోల్‌లో జరిగిందని వీడియోతో పాటు పెట్టిన డీటెయిల్స్ రాసాడు. బేసిక్ థింగ్ ఉంటంటే వీడియోలో చూపించిన భూమి పచ్చగా, ఏదో నదో…లేకపోతే చెరువు లాంటి దాని దగ్గరో ఉంది. అతను చెప్పిన ప్లేస్ ఏంటి నార్త పోల్. నార్త్ పోల్ లో భూమి, నీరు ఏమీ కనిపించవు. నిత్యం మంచుతో కప్పబడి ఉంటుంది. ఆర్కిటిక్ సముద్రంలో ఉంటుంది. ఆర్కిటిక్ లో ఉండే మంచునంతా ఈ భూభాగం ఎప్పుడూ తరలిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఏ కాలం అయినా మంచే కనిపిస్తుంది. మరి అలాంటి చోట పచ్చటి భూమి, నీరు ఎలా వచ్చింది. ఇంత బేసిక్ విషయాన్ని జనాలు ఎందుకు పట్టించుకోలేదో మరి.

ఇక మరో విషయం ఏంటంటే చంద్రుడు భూమి నుంచి 2, 38 వేల 885 మైళ్ల దూరంలో ఉంటాడు. అంటే 30 భూముల వ్యత్యాసానికి సమానమైన తేడా అన్నమాట. అప్పుడప్పుడూ భూమికి దగ్గరగా చంద్రుడు వస్తాడు, అప్పుడు పెద్దగా కనిపిస్తాడు. అది కూడా ఉదయించినప్పుడు, అస్తమించినప్పుడు మాత్రమే. కానీ వీడియోలో చూపించినంత పెద్దగా మాత్రం కాదు. వీడియోలో చూపించినట్టు మూన్ భూమికి దగ్గరగా వస్తే దారుణాలు జరుగుతాయని అంటున్నాయి లైవ్ సైన్స్, ఇంకా కొన్ని సైన్స్ వెబ్ సైట్లు.

భూమికి దగ్గరగా మూన్ వస్తే గ్రావిటేషన్ పుల్ మరింత పెరిగిపోతుంది. దానివలన సముద్రంలో ఆటుపోట్లు విరపీతంగా జరుగుతాయి. అదే కనుక జరిగితే ఐలాండ్స్, సముద్రం కింద ఉంటే నగరాలు అన్నీ కొట్టుకుపోతాయి వెంటనే. భూమ్యాకర్షణ శక్తి సడెన్ గా పెరిగిపోతే అగ్నిపర్వతాలన్నీ ఒక్కసారిగా బద్దలయిపోతాయి అని చెబుతున్నారు. కాబట్టి ఆ వీడియోని అస్సలు నమ్మకండి. దాన్ని సర్క్యూలేట్ చేయడం ఆపండి అని మొత్తుకుంటున్నారు. అది మొత్తం కంప్యూటర్ గ్రాఫిక్స్ రా నాయనా…కళ్ళు తెరచి చూడండి అని చెబుతున్నారు.