Viral video shows leopard climbing up and down a coconut tree in Nashik
mictv telugu

కొబ్బరి చెట్టెక్కి కొట్టుకున్న చిరుతలు.. వీడియో

September 20, 2022

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతాయి. తాజాగా చిరుత పులికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో చిరుత పులి కొబ్బరి చెట్టు ఎక్కింది. కోతిలాగా చాలా సింపుల్ చిరుత చెట్టు ఎక్కింది. చెట్టు ఎక్కిన చిరుత చుట్టు పరిసరాల్లో ఏమైనా జంతువులు ఉన్నాయో పరిశీలించింది. అనంతరం కిందికి దిగింది. మొక్క జొన్న చేలో ఉన్న కొబ్బరి చెట్టును చిరుత ఎక్కింది. కాసేపటి తరువాత కిందకు దిగేందుకు ప్రయత్నించింది.

ఇంతలో మరో చిరుత రావడంతో భయంతో మళ్లీ పైకి ఎక్కింది చిరుత. అయితే, కింద నుంచి వచ్చిన చిరుత సైతం పైకి దూసుకెళ్లి మరో చిరుతపై అటాక్ చేసింది. ఆ సీన్ చాలా భయంకరంగా, గుండెలదిరేలా ఉంది. కొబ్బరి చెట్టు చివరన రెండు కాసేపు పోట్లాడుకోగా.. అందులో ఓ చిరుత భయంతో కిందకు దిగింది. మరో చిరుత పైనే ఉండిపోయింది. చిరుతలు కొబ్బరి చెట్టు ఎక్కడాన్ని అక్కడే ఉన్న కొందరు రైతులు వీడియో తీశారు. ఈ వీడియోను సుశాంత్ నందా అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోను ఆదివారం పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు లక్ష 43 వేల వ్యూస్ వచ్చాయి. 3 వేలకు పైగా లైక్స్ రాగా.. 600లకు పైగా మంది రీట్వీట్ చేశారు. సుశాంత్ నందా వీడియోతో పాటు చిరుతపులి కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కిందో అని ఆలోచిస్తే చివరి వరకు చూడండి అని రాసుకొచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. వామ్మో.. చిరుత పులి కొమ్మలున్న చెట్లే కాకుండా, నిటారుగా ఉన్న కొబ్బరి చెట్లు కూడా ఎక్కుతాయా అని కామెంట్ చేశారు.