Viral video Shows Mountain Lion Hiding Outside A House, Internet Reacts
mictv telugu

వీడెవర్రా బాబూ.. భయంతో దాక్కుని తొంగితొంగి చూసిన సింహం..

September 30, 2022

Viral video Shows Mountain Lion Hiding Outside A House, Internet Reacts

పులులు, సింహాలు వంటి అడవి జంతువులు ఆహారం విషంలోనే క్రూరంగా ఉంటాయి. బతకడానికే అవి ఇతర జంతువులను చంపితింటాయి తప్పితే మిగతా విషయాల్లో మనుషుల్లాగే సేమ్ టు సేమ్. ప్రేమ, సరసం, విషాదం, భయం, దుఃఖం వాటికీ ఉంటాయి. అలాంటి ఓ సింహం అరణ్యం నుంచి దారి తప్పి మానవారణ్యంలోకి వచ్చి బిక్కచచ్చిపోయింది. జాగింగ్ చేస్తున్న మనిషిని చూసి జడుసుకుని పొదల్లో దాక్కుంది. అంతేకాకుండా, తొంగి తొంగి చూస్తూ ‘వీడెవర్రా బాబూ.. కాళ్లు సరిగ్గా లేవా, అలా నడుస్తున్నాడేమిటి?’ అన్నట్లు విస్తుబోయి చూసింది. ఆ అమాయక సింహం వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుతోంది.

ఎక్కడో ఓ ఇంటి ముందు సీసీ కెమెరాలో రికార్డయి ఈ వీడియోను ఐఏఎఫ్ అధికారి సుశాంతా నందా ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. జంతువుల ఎవరి జోలికీ వెళ్లవని, వాటికి అపాయం కలిగిస్తే సమస్య వస్దుందని ఆయన అన్నారు. ‘‘అడవి జంతువులు చాలా సందర్భాల్లో మనుషులు ఎదురైనప్పుడు పక్కకు తప్పుకుంటాయి. వాటిని భయపెడితే సమస్య’ అని అన్నారు.

వన్యమృగాలు నిజంగా అంత క్రూరమైనవా? ఈ వీడియో చూస్తే మీకు విషయం అర్థమవుతుంది..