Viral video tiger taking away woman in china safari
mictv telugu

పులి ఆమెను లటుక్కున ఈడ్చుకెళ్లింది.. షాకింగ్ వీడియో

February 14, 2023

Viral video tiger taking away woman in china safari

అప్పుడే కారు దిగిన ఓ మహిళను వెనక నుంచి వచ్చిన పెద్దపులి బార్బీ బొమ్మను లాక్కుపోయినట్లు పొదల్లోకి ఈడ్చుకెళ్లింది. ఒళ్లు జలదరించే ఈ సీన్ వీడియో ప్రస్తుతం నెట్టింట ఘోరంగా వైరల్ అవుతోంది. పెద్దపులులు అంత భీకరంగా దాడి చేస్తాయని కామెంట్లు పెట్టుకుంటున్నారు జనం. అయితే ఇది పాత వీడియోనే. 2016లో చైనాలోని ఓ టైగర్ సఫారీలో ఈ ఘోరం జరింది. ఇందులో మరో బీభత్సమైన కొసమెరుపు ఉంది. పులి బారినపడిన తీవ్ర గాయడాలతో చనిపోగా, కాపాడబోయిన ఆమె తల్లిని మరో పెద్దపులి చంపేసింది.

చైనా రాజధాని బీజింగ్ సమీపంలోని బదాలింగ్ టైగర్ సఫారీలో ఈ సంఘటన జరిగింది. సఫారీలో సందర్శకులు వాహనాలు దిగకూడదని తాటికాయంత అక్షరాలతో బోర్డులు రాసిపెట్టి ఉన్నా మహిళ కారు దిగి మరోవైపు వచ్చి మళ్లీ ఎక్కబోయిది. కారులోకి ఎక్కబోతుండగా వెనక నుంచి పెద్దపులి మీదపడి ఈడ్చుకెళ్లింది. ఆమె భర్త, ఆమె తల్లి కాపాడ్డానికి పొదల్లోకి వెళ్లారు. అక్కడే ఉన్న మరో పులి ఆమె తల్లిని చంపేసింది. భర్త మాత్రం పులుల బారిన పడకుండా తప్పించుకున్నాడు. అయితే ఈ దృశ్యాలు కెమెరాల్లో నమోదు కాలేదు. టైగర్ సఫారీల్లో జరిగే ప్రమాదాలు చాలావరకు సందర్శకుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయని అధికారులు చెబుతున్నారు.