పాడె మోస్తూ పోలీసులు డ్యాన్స్.. తస్మాత్ జాగ్రత్త (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

పాడె మోస్తూ పోలీసులు డ్యాన్స్.. తస్మాత్ జాగ్రత్త (వీడియో)

May 5, 2020

Viral Video TN police imitate Ghana dancing pallbearers

లాక్‌డౌన్ వేళ నిర్లక్ష్యంగా రోడ్ల మీదకు వచ్చేస్తన్న ఆకతాయిలకు పోలీసులు ఎన్నో విధాలుగా నచ్చజెబుతున్నారు. అయినా వినకుండా బయటకు వచ్చి కరోనా వ్యాప్తిలో పాలు పంచుకుంటున్నారు. ఇలాంటివారి కోసం పోలీసులు వినూత్నంగా ఓ సినిమానే చూపించారు. తమిళనాడులోని కడలూరుకు చెందిన పోలీసులు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా ఉంటుందో వీడియో రూపంలో చూపించారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి పోలీసులు పహారా కాస్తుండటం చూస్తాడు. ఇప్పుడు కానీ ముందుకు వెళితేనా… అని ఊహించుకుంటాడు. అందులో పోలీసులు అతనిని పాడెపై పడుకోబెట్టుకుని, మోస్తూ డ్యాన్స్ చేస్తారు. దీంతో ఒక్కసారిగా భ్రమలోంచి బయటకు వచ్చిన యువకుడు ఎందుకొచ్చిన గొడవరా బాబూ.. రోడ్డు మీదకు వెళ్లందే బెటర్’ అనుకుని బైకును యూటర్న్ తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పోలీసుల ఐడియా బాగుందంటూ మెచ్చుకుంటున్నారు. 

అయితే ఈ వీడియోలో బాగా పాపులర్ అయిన కాఫిన్ డ్యాన్స్‌‌ను చూపించారు. ఈ డ్యాన్స్ మాత్రం దాదాపుగా అందరికీ తెలిసిందే. ఇది ఘనా దేశపు సాంప్రదాయ డ్యాన్స్. ఇందులో మనిషి అంత్యక్రియలు జరుగుతుంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ వస్తుంటుంది. ఇంతలో యూనిఫాం వేసుకున్న నలుగురు వ్యక్తులు శవపేటికను మోస్తూ డ్యాన్స్ చేస్తుంటారు. చావును కూడా వేడుకగా చేసుకుంటారు. అయితే శిక్షణ పొందిన బ్యాండ్‌లకు మాత్రమే పాడె మోసే అవకాశం ఉంటుంది. వీరిని ‘పల్బెరియాస్’ అని అంటారు. దీనిని తీసుకొచ్చి కడలూరు పోలీసులు కరోనా అవగాహన కోసం వాడటం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.