క్లాస్ రూమ్‌లో అది కూడా ప్రొఫెసర్ పాఠాలు చెబుతున్న సమయంలో రెచ్చిపోయాడు వెనుక బెంచ్‌లో ఉన్న ఓ స్టూడెంట్. తన లవర్ పొడవాటి జుట్టును సవరిస్తూ ముద్దు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసీ చూడగానే మరింత ముదిరిపోయారు.. అనుకుంటూ ఉండగానే ఆఖర్లో ట్విస్ట్ చూసి బిగ్గరగా నవ్వుకుంటున్నారు.
View this post on Instagram
ఆ స్టూడెంట్ తన పక్కనే ఉన్న యువతితో రొమాన్స్ చేస్తున్నట్లు వీడియో తీశాడు వారి వెనకాల కూర్చున్న వ్యక్తి. యువతి భుజంపై చేయి వేసి ఆమె జుట్టును అలా ప్రేమగా కదిలిస్తూ తన చెంపను ముద్దాడుతాడు. అయితే రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కెమెరాను వెనకాల నుంచి ముందుకు తీసుకొచ్చి వాళ్ల ముఖాలని చూపిస్తాడు. దీంతో ఆ స్టూడెంట్ గర్ల్‌ఫ్రెండ్ ముఖం చూసి నెటిజన్లు షాకయ్యారు. అచ్చం అమ్మాయిలాగా కనిపించింది అబ్బాయేనని తెలిసి పడి పడి నవ్వుకున్నారు.