Viral video: UP flower seller makes fan-fitted helmet to beat the heat
mictv telugu

సన్యాసి ఐడియా సూపర్.. ఫ్యాన్ ఎక్కడ పెట్టుకున్నా, పవరేంటో చూడండి..

September 22, 2022

Necissity is mother of Invention అని ఇంగ్లీష్ లో ఓ పాపులర్ సామెత. దాని సారాంశం అవసరమనేది ఆవిష్కరణలకు ప్రధాన కీలకమని అర్ధం. సైంటిస్టులు.. కొత్త కొత్త వస్తువులను కనిపెడుతుంటారని తెలుసు. కానీ ఓ సామాన్య వ్యక్తి తన సమస్యకు పరిష్కారంగా ఒక వినూత్న ఆవిష్కరణకు నాంది పలికాడు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఒ ఓ వ్యక్తి ఫ్యాన్‌తో కూడిన హెల్మట్‌ని ధరించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. లఖింపూర్ ఖేరీ జిల్లాలోని లల్లూరామ్ (77) అనే వ్యక్తి పువ్వులు విక్రయించి జీవిస్తాడు. అయితే మండే ఎండల్లో రోజూ పువ్వులు అమ్ముకోవడం తనకు కష్టంగా ఉండేది. దానివల్ల అనారోగ్యానికి గురయ్యాడు. ఆ వేడి నుంచి ఎలాగైనా ఉపశమనం పొందాలనుకున్నాడు బాగా ఆలోచించి.. తనకు చల్లదనాన్ని ఇచ్చే వస్తువును కనిపెట్టాడు.

తను ధరించే హెల్మెట్‌పై చిన్న సోలార్ ప్యానెల్, చిన్న ఫ్యాన్‌ను అమర్చాడు. ఎండ వేడిని ఇంధనంగా మార్చుకుని.. ఆ ఫ్యాన్ నిత్యం తిరుగుతుంది. దాంతో లల్లూరామ్‌కు ఎండ వేడి నుంచే చల్లదనం పుట్టుకొస్తుంది. ఈ వస్తువును తయారు చేయడానికి చాలా కష్టపడ్డాడు.ఒక్కొక్కరి నుంచి ఒక్కో వస్తువుని తీసుకుని.. ఈ హెల్మెట్‌ను తయారు చేసినట్టు లల్లూరామ్ చెప్పాడు. ఈ పోర్టబుల్ ఫ్యాన్ వల్ల వేడి నుంచి చాలా ఉపశమనం లభిస్తుందని చెప్పాడు. లల్లూరాం రోజూ ఇంటింటికీ వెళ్లి పువ్వులు అమ్ముతాడు. ఆ డబ్బుతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.