Viral Video : Virat Kohli grooves with Norway's dance group
mictv telugu

డ్యాన్సుతో ఇరగదీసిన కోహ్లీ….

March 15, 2023

Viral Video : Virat Kohli grooves with Norway's dance group

మైదానంలో బ్యాట్ పట్టి విధ్వంసం సృష్టించడం మాత్రమే కాదు కెమెరా ముందు అదే బ్యాట్‍‏తో స్టైలిష్ స్టెప్స్ వేసి అదరగొట్టగలడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. తనదైన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విరాట్, అప్పుడప్పుడు యాడ్స్‏లో కనిపిస్తూ ఫ్యాన్స్‏ను ఖుషీ చేస్తుంటాడు. రీసెంట్‏గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచిన ఆనందంలో ఉన్న విరాట్ సోషల్ మీడియాలో ఓ అద్భుతమైన వీడియోను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ముంబైకి చేరుకున్న విరాట్ వెంటనే ప్రాక్టీస్‎ను మొదలుపెట్టేయకుండా కాస్త చిల్ అవుతున్నాడు.

భారత పర్యటనకు వచ్చిన నార్వే డ్యాన్స్ గ్రూప్‏తో దిగిన పిక్‏తో పాటు వారితో కలిసి చేసిన షార్ట్ లెన్త్ డ్యాన్స్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‍‏లో షేర్ చేశాడు విరాట్. నార్వే డ్యాన్స్ ట్రూప్‏తో ఈ స్టార్ క్రికెటర్ డ్యాన్స్ చేస్తే బొమ్మ ఎలా ఉంటుందో తెలుసా. పోస్ట్ చేసిన నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చి పడాయి. బ్యాట్ పట్టుకుని విరాట్ స్టెప్పులేస్తుండగా విరాట్ వెనకాల నార్వే ట్రూప్ విరాట్ తో కలిసి డ్యాన్స్ చేసింది. సింపుల్ షార్ట్ వీడియో అనినప్పటికీ నెట్టింట్లో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది ఈ వీడియో. క్రికెటర్ అయిన విరాట్ ఇలా పాటకు తగ్గట్లుగా స్టెప్పులేసి ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేశాడు. ఈ వీడియో చూసిన అభిమానులు శభాష్ అంటూ విరాట్‏ను పొగడ్తలతో ముంచేస్తున్నారు. విరాట భార్య అందాల అనుష్క శర్మ ఈ వీడియో కామెంట్ బాక్స్ లో ఫైర్ ఏమోజీని పోస్ట్ చేసింది. దీంతో అనుష్క రియాక్షన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

క్విక్ స్టైల్ కొన్ని షోలు చేసేందుకు ముంబై వచ్చింది. ఈ సందర్భంగా తమ అభిమాన క్రికెటర్ కోహ్లీని కలిశారు. కోహ్లీ కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితం కాకుండా తనదైన స్టైల్‏తో డ్యాన్స్ చేసి కుర్రళ్ళను ఉర్రూతలూగించాడు. సాడి గల్లీ, కాలా చష్మా వంటి బాలీవుడ్ హిట్ సాంగ్స్‏కు డ్యాన్స్ చేసి క్విక్ స్టైల్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ క్రికెటర్ తోనూ స్టెప్పులేయడంతో మరింత క్రేజ్‏ను ఈ ట్రూప్ సొంతం చేసుకుంది.