Home > వైరల్ > అట్లీని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..షారుఖ్ ఏమంటారో?

అట్లీని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..షారుఖ్ ఏమంటారో?

అట్లీని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..షారుఖ్ ఏమంటారో?
X

ఒకప్పుడు ఆస్కార్ అంటే అమ్మో అనుకునేది భారతీయ చిత్ర పరిశ్రమ. అంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డులు మనకు ఎందుకు వస్తాయిలే అని అనుకునేవారు ఫిల్మ్ మేకర్స్. ప్రతీ సంవత్సరం భారత్ నుంచి అలవాటుగా ఆస్కార్ కోసం పంపడం, మొదటి వడపోతలోనే అవి వెనక్కి వచ్చేయడం జరుగుతుండేది. కానీ దర్శకధీరుడు రాజమౌళి ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. మన దేశం ఆస్కార్‎కు ఆర్ఆర్ఆర్‏ను అధికారికంగా పంపించకపోయినా, ఓ స్ట్రాటజీతో రాజమౌళి అండ్ టీమ్ ఆర్ఆర్ఆర్‎ను ఆస్కార్‎కు పంపించారు. ఎంతో కష్టపడి ప్రమోషన్లు చేసి నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డును దక్కించుకున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశారు.

దీంతో ఫిల్మ్ మేకర్స్‎కు భారతీయ సినిమాలు సైతం ఆస్కార్ సాధించగలవన్న నమ్మకం కలిగింది.

లేటెస్టుగా యువ దర్శకుడు అట్లీ కూడా ఆస్కార్ రేసులో తాను డైరెక్ట్ చేసిన జవాన్ సినిమాను నిలబెట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఆస్కార్ రేస్‎పై అట్లీ చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. " ప్రతీ ఫిల్మ్ మేకర్‌కు అవార్డుల మీద ఆశ ఉంటుంది. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్, జాతీయ అవార్డులు పొందాలని కలలు కంటాడు. అన్నీ కుదిరితే జవాన్ సినిమాను ఆస్కార్ రేసులో నిలబెట్టాలని అనుకుంటున్నాం. షారుఖ్ సార్ ఏమంటారో చూడాలి"అని అట్లీ వ్యాఖ్యలు చేశారు.

అట్లీ కామెంట్లపై నెటిజెన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు. అన్ని సినిమాలు కలిపి నువ్ తీసిన మిక్చర్ సినిమాకు ఏ కేటగిరీలో ఆస్కార్ ఇవ్వమంటావ్ అంటూ అట్లీని ట్రోల్ చేస్తున్నారు. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్‌లాంటి మూవీ తీసి ఆస్కారా అంటావా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నిజానికి అట్లీ తీసిన జవాన్ సినిమాకు దక్షిణాదిన అంతగా ఆదరణ లేకపోయినప్పటికీ నార్త్‌లో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. షారుఖ్ నటించిన పఠాన్ తర్వాత బాలీవుడ్‌లో జవాన్ బిగ్గెస్ట్ రికార్డులను క్రియేట్ చేస్తోంది.

Updated : 19 Sep 2023 1:54 PM GMT
Tags:    
Next Story
Share it
Top