కోహ్లీకి కోపమొచ్చింది.. బ్యాట్ విసిరేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

కోహ్లీకి కోపమొచ్చింది.. బ్యాట్ విసిరేశాడు..

December 3, 2017

భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీకి కోపమొచ్చింది. వాతావరణ కాలుష్యమంటూ శ్రీలంక ఆటగాళ్లు నానా యాగీ చేయడంతో ఆగ్రహం తట్టుకోలేకపోయాడు. కాలుష్యం పేరు చెబుతూ లంకేయులు  మ్యాచ్‌కు మాటిమాటికీ అడ్డుతగలంతో కోహ్లీ కోపంతో బ్యాట్ విసిరిపారేశాడు. అసంతృప్తితో ఆడుతున్న క్రమంలో ఏకాగ్రత కోల్పోయి తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. భారత్‌-శ్రీలంక మూడో టెస్టు మ్యాచ్‌ ఈ కోపతాపాలకు వేదికైంది.  గాల్లో నాణ్యత కరవైందని శ్రీలంక ఆటగాళ్లు మ్యాచ్‌కు అంతరాయాలు కలిగించారు. ముఖానికి మాస్కులు తొడుక్కుని హంగామా చేశారు. దీంతో కోహ్లీ 127.5 ఓవర్లకు జట్టు స్కోరు 536/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. ఆ సమయానికి వృద్ధిమాన్‌ సాహా (9; 19 బంతుల్లో 1×4), రవిచంద్రన్‌ అశ్విన్‌ (5; 4 బంతుల్లో 1×4) బ్యాటింగ్‌ చేస్తున్నారు. కోహ్లీ (243; 287 బంతుల్లో 25×4) కదం తొక్కాడు. సారథిగా ఆరో ద్విశతకం బాదేశాడు.