virat kohili hotel room video leaked
mictv telugu

కోహ్లీ రూంలోకి దూరి అభిమాని చిల్లర పనులు

October 31, 2022

 virat kohili hotel room video leaked

హద్దుమీరిన అభిమానంతో ఒక్కోసారి హీరోలు, క్రీడాకారులు ఇబ్బందులకు గురవుతారు.ఒక సెలబ్రెటీని అభిమానించడం అంటే అతని యొక్క మంచి మార్గం అనుసరించడం, తనని స్ఫూర్తిగా తీసుకోని ఎదగడం వంటి విషయాలను పక్కనబెట్టి వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసి ఇబ్బందులకు గురిచేస్తారు. ఇలాంటి అభిమానంతో టీం ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది. టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న కోహ్లీ ఉంటున్న రూం వీడియో ఓ అభిమాని చిత్రీకరించడం హాట్ టాపిక్ గా మారింది.. హోటల్ రూంలోకి నేరుగా వెళ్లిన ఓ అభిమాని కోహ్లీ వాడిన వస్తువులతో పాటు రూం మొత్తాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు..ఇది కోహ్లీని షాక్ కు గురిచేసింది. తన రూం వీడియా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంపై కింగ్ కోహ్లీ మండిపడ్డారు… కోహ్లీ ఇన్ స్టా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు..

అభిమాన క్రీడాకారులని చూసేందుకు, కలిసేందుకు ఉత్సాహం ఉండొచ్చని అయితే వారి వ్యక్తిగత గోప్యతను భంగం కలిగించరాదని కోరాడు. ప్రైవసీని గౌరవించాలని అభిమానులను కోహ్లీ సూచించాడు. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి తనేం వస్తువు కాదని.. నా రూంలో ప్రైవసీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుందని..దయచేసి అందరూ వ్యక్తిగత ప్రైవసీని గౌరవించాలంటూ ఇన్ స్టాలో కోహ్లీ పోస్ట్ చేసాడు..

ఈ ఘటనపై కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా తీవ్రంగా మండిపడింది. ఇది చాలా చెత్తగా ఉంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎదుర్కొన్నాం.ఇలాంటిదే మీ బెడ్ రూంలో జరిగితే పరిస్థితి ఏంటి ? అంటూ ఘాటుగా స్పందించింది. అయితే కోహ్లీ రూంలోకి అభిమాని వెళ్లి వీడియో తీయడం కిక్రెటర్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…