వామిక.. కోహ్లీ కూతురు పేరుకు అర్థమేంటి? - MicTv.in - Telugu News
mictv telugu

వామిక.. కోహ్లీ కూతురు పేరుకు అర్థమేంటి?

February 1, 2021

vgrg

పిల్లలకు పేర్లు పెట్టడంలో మన సెలబ్రిటీల స్టయిలే వేరు. సంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునిక పోకలు పోతుంటారు. తమ బిడ్డ పేరు చాలా ప్రత్యేకంగా, ఆకట్టుకునేలా ఉండాలని అనుకుంటారు. భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు కూడా అంతే. తమ తొలి సంతానమైన ఆడపిల్లకు ఈ జంట ఎవరూ వినని పేరు పెట్టింది. అయితే అది అత్యంత పాత పేరు కూడా కావడం విశేషం.

తమ కూతురికి వామిక అని పేరు పెట్టింది విరుష్క జంట. వామిక అంటే పార్వతీదేవి అని అర్థం. శివుడిలో అర్థభాగమైన పర్వతపుత్రికను వామిక అని కూడా అంటారు. అర్ధనారీశ్వర రూపంలో కుడివైపు శివుడు, ఎడమవైపు పార్వతి ఉంటారు. వామం అంటే ఎడమవైపు. వామంవైపు ఉండేది కనుక వామిక అని పార్వతమ్మను కీర్తిస్తారు. కోహ్లీ, అనుష్కలు భారత సంప్రదాయాలను గౌరవిస్తారు. అందుకే హిందువుల దేవతైన పార్వతి పేరును కూతురికి పెట్టుకున్నారు. వామిక పేరులో వారి పేర్లలోని అక్షరాలు కూడా కలిసేలా జాగ్రత్త పడ్డారు. విరాట్ పదంలోని తొలి అక్షరం, అనుష్క పదంలోని చివరి అక్షరం వామికలో ఉన్నాయి. పాత పేర్లను తిరిగి ప్రచారంలోకి తేవడం బాలీవుడ్‌లో ఇటీవల బాగా కనిపిస్తోంది. కోహ్లీ సహ ఆటగాడు రోహిత్ శర్మ కూతురు పేరు సమాయిరా కూడా పాతదే. సమాయిరా అంటే కాపాడే దేవత అని. సినీతారలు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌లు తమ కొడుక్కి తైమూర్ అని చాలా పాత పేరు పెట్టుకున్నారు.