అందచందాల విరుష్క జంట ఒకటైన వేళ.. - MicTv.in - Telugu News
mictv telugu

అందచందాల విరుష్క జంట ఒకటైన వేళ..

December 12, 2017

బాలీవుడ్ అందాల తార అనుష్కా శర్మ, క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీల పెళ్లి సోమవారం ఘట్టం ముగిసిన సంగతి తెలిసిందే. చాలా ఫొటోలు కూడా బయటికొచ్చాయి. కొద్దిమంది ఆత్మీయ మిత్రులు, బంధువుల సమక్షంలో వివాహం జరిగింది. ఇటలీలోని టక్కనీ రిసార్టులో ఈ తంతు ముగిసింది. విరాట్, అనుష్కలు సంప్రదాయ హిందూస్థానీ సంగీత నేపథ్యంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఒకయ్యారు.
క్రీమ్ కలర్ దుస్తుల్లో నవ వధువులు చుక్కల్లా మెరిసిపోయారు. మెల్లగా నడుచుకుంటూ వచ్చిన వధువును కోహ్లీ చేయి పట్టుకుని దగ్గరకు తీసుకుని చెవిలో ఏమో చెప్పాడు. అనుష్క పెద్దగా సిగ్గుపడకుండా అతనికి హావభావాలతోనే ప్రేమగా బదులేదో చెప్పింది. దండలు మార్చుకునేటప్పుడు ఆమె ఇబ్బంది పడిది. ఎత్తుగా ఉన్న కోహ్లీ మెడలో.. వేరే మహిళ సాయంతో దండ వేసింది. ఉంగరాలు మార్చుకోవడం, కోహ్లీని పెళ్లికొడుకును చేస్తున్న సీన్లు కూడా కనిపించాయి. వీరి పెళ్లి దుస్తులను ఫ్యాషన్‌ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ  డిజైన్ చేశాడు. కొత్త జంట ఈ నెల 21న ఢిల్లీలో బంధువులకు, 26న ముంబైలో సెలబ్రిటీలకు విందు ఇవ్వనుంది. సింపుల్ గా రొమాంటిగ్గా సాగిన విరుష్క పెళ్లి వీడియో ఇదే..