విరుష్క పెళ్లి ఫొటోలు అమ్మకానికి.. రండి బాబూ రండి..! - MicTv.in - Telugu News
mictv telugu

విరుష్క పెళ్లి ఫొటోలు అమ్మకానికి.. రండి బాబూ రండి..!

December 12, 2017

సుదీర్ఘ ప్రేమాయాణం తర్వాత ఒకటైన క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, సినిమా స్టార్ అనుష్కా శర్మలు తమ పెళ్లి ఫొటోలను అమ్మకానికి పెట్టారు. అమ్మడానికే ప్రత్యేకంగా వీటిని తీయించుకున్నారంటే ఎంత అందంగా ఉంటాయో మీరే ఊహించుకోండి. వీటిని అమ్మగా వచ్చే డబ్బును చారిటీ సంస్థలకు ఇవ్వాలని కొత్త జంట నిర్ణయించింది. ఇటలీలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఫొటోలు కొన్ని మాత్రమే బయటికొచ్చాయి. వీడియోలు కూడా అరకొరగానే ఉన్నాయి. మాంగల్య ధారణ.. వంటివేమీ కనిపించడం లేదు.ఫొటోలను వేలం వేసుకుని సొమ్ముచేసుకుని బ్యాంకుల్లో దాచిపెట్టుకునే సెలబ్రిటీలకు భిన్నంగా ఆ సొమ్మును దాతృత్వం కార్యక్రమాలకు ఇవ్వాలని వీరు నిర్ణయంచుకోవడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలందరూ వీరి బాటలో పయనిస్తే కొద్దిమందికైనా చేయూత అందుతుందని నెటిజన్లు అంటున్నారు.