సాధించాడు.. విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డ్..  - MicTv.in - Telugu News
mictv telugu

సాధించాడు.. విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డ్.. 

November 22, 2019

Virat Kohli becomes fastest captain to 5000 runs in Test cricket  

రికార్డులన్నీ కట్టగట్టుకుని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంటి గుమ్మం ముందు నిలబడినంత పనే చేస్తున్నాయి. తాజాగా కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. టెస్టు ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఐదు వేల పరుగుల్ని వేగవంతంగా పూర్తి చేసి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ మార్కును చేరుకున్నాడు. ఈ టెస్టు ముందు కెప్టెన్‌గా  4,968 పరుగులతో ఉన్న కోహ్లి.. తాజా మ్యాచ్‌లో 32 పరుగులు చేయడంతో ఆ రికార్డును సాధించాడు. మొత్తం కలుపుకుంటే ఇది కోహ్లికి 84వ టెస్టు కాగా, 7,100 పరుగులు పైగా చేశాడు. అయితే ప్రస్తుతం కోహ్లి 141వ టెస్టు ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. కెప్టెన్‌గా మాత్రం కోహ్లికిది 86వ ఇన్నింగ్స్‌.

ఈ రికార్డు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ పేరిట ఉండేది. ఒక కెప్టెన్‌గా ఐదు వేల టెస్టు పరుగులు చేయడానికి పాంటింగ్‌ 97 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పుడు దాన్ని కోహ్లి బ్రేక్‌ చేశాడు. కోహ్లీ మాత్రం ఒక కెప్టెన్‌గా ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి టీమిండియా క్రికెటర్‌గా కూడా ఘనత సాధించాడు. అదే సమయంలో కెప్టెన్‌గా ఐదువేల టెస్టు పరుగులు చేసిన ఆరో క్రికెటర్‌గా నిలిచాడు. 

ఈ జాబితాలో మరికొందరు ఇలా.. 

-రికీ పాంటింగ్‌ – ఆస్ట్రేలియా-97 ఇన్నింగ్స్‌లు

-క్లైవ్‌ లాయిడ్‌ – వెస్టిండీస్‌-106 ఇన్నింగ్స్‌లు

-గ్రేమ్‌ స్మిత్‌ – దక్షిణాఫ్రికా-110 ఇన్నింగ్స్‌లు

-అలెన్‌ బోర్డర్‌ – ఆస్ట్రేలియా-116 ఇన్నింగ్స్‌లు

-స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ – న్యూజిలాండ్‌-130 ఇన్నింగ్స్‌లు ఉన్నారు.