Virat Kohli Face Morphed To Balakrishna Veera Simha Reddy Poster
mictv telugu

చేజింగ్‌లో ఓడిపోవడం నా చరిత్రలో లేదు.. కోహ్లీపై బాలయ్య ఫాన్స్ రచ్చ

October 24, 2022

టీమిండియా చారిత్రత్మక విజయాల్లో నిన్నటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఖచ్చితంగా టాప్ 10లో ఉంటుంది. వరల్డ్ కప్ ఫైనల్ స్థాయిలో.. 90వేల మంది జనాలతో కిక్కిరిరిసిన స్టేడియంలో.. వందల కోట్ల భారతీయులు వీక్షిస్తున్న మ్యాచ్ లో కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ఇండియాకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. గత 3 సంవత్సరాలుగా కోహ్లీ ఎదుర్కొంటున్న విమర్శలు ఒక్కసారిగా మారిపోయి.. దేశమంతా కోహ్లీ నామస్మరణతో మారు మ్రోగింది. ‘కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కొందరు.. కింగ్ ఈజ్ ఆల్ వెజ్ కింగ్’ అని మరికొందరు.. కోహ్లీ ఫాన్స్ ఎవరికీ తోచిన విధంగా వారు శుభాకాంక్షలు తెలుపుతుంటే.. మన బాలయ్య అభిమానులు సైతం వినూత్న రీతిలో కోహ్లీకి విషెష్ చెప్పారు.

తాజాగా ప్రకటించిన బాలకృష్ణ 107వ సినిమాకు టైటిల్ ‘వీరసింహారెడ్డి’ పోస్టర్‌ను మార్ఫింగ్ చేసి విరాట్ కోహ్లీ రూపంలోకి మార్చిన కొత్త పోస్టర్‌ను స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్వీట్ చేయగా.. బాలయ్య ఫాన్స్ తెగ ప్రమోట్ చేస్తున్నారు. ‘చేజింగ్‌లో ఓడిపోవడం నా బయోడేటాలోనే లేదు!’’ అని విరాట్ కోహ్లీ, బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ తో మీమ్స్ చేస్తున్నారు. కోహ్లీ పేరును కూడా మార్చి.. ‘విరాట్ సింహ కోహ్లీ’గా రాశారు. ఇక ‘వీరసింహారెడ్డి’ పోస్టర్‌లోని గొడ్డలి ఉన్నచోట బ్యాట్ పెట్టారు. మైలురాయిపై ‘పులిచర్ల 4 కి.మీ’ అని రాసి ఉంటే.. దాన్ని తీసి కోహ్లీ స్కోరు 82 నాటౌట్ (53) అని మార్చారు. మొత్తం మీద పాకిస్థాన్ మీద కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌ను బాలయ్య ఫాన్స్ తమదైన రీతిలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.