Virat Kohli Fan Danielle Wyatt Gets Engaged to Georgie Hodge
mictv telugu

కొహ్లీకి ప్రపోజ్ చేసి..అమ్మాయితో ఎంగేజ్మెంట్

March 3, 2023

Virat Kohli Fan Danielle Wyatt Gets Engaged to Georgie Hodge

ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ విరాట్ కొహ్లీకి డై హార్డ్ ఫ్యాన్. 2014లో ఈ క్రికెటర్ విరాట్ కు ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచింది. ఆ రకంగా భారత్ క్రికెట్ లవర్స్‏కు ఈ లేడీ క్రికెటర్ సుపరిచితురాలు అయ్యింది. తాజాగా డేనియల్ తన పెళ్లి విషయంలోనూ ప్రపంచాన్నే షాక్‏కు గురిచేసి మరోసారి వార్తల్లో నిలిచింది. తన ప్రియురాలు జార్జి హాడ్జ్‌తో ఎంగేజ్మెంట్ జరిగిందని ప్రపంచానికి ప్రకటించి అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో సెన్సేషన్‏ను క్రియేట్ చేస్తోంది. డేనియల్ వ్యాట్ పోస్ట్ చేసిన ఎంగేజ్మెంట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీరి పిక్స్ చూసిన నెటిజన్లు ఒక్కో రకంగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇంగ్లాండ్ క్రికెటర్ డేనియల్ వ్యాట్ జార్జి హాడ్జ్‌తో లాంగ్ టైమ్ లివ్ ఇన్ రిలేషన్ షిప్ ను కొనసాగిస్తోంది. జార్జి హాడ్జ్‌ CAA బేస్‌లో మహిళల ఫుట్‌బాల్‌ ఏజెన్సీని లీడ్ చేస్తోంది. ఇది ఫుట్‌బాల్ క్రీడాకారుల కెరీర్‌ను అభివృద్ధి చేయడానికి అంకితమైన ఏజెన్సీ. పరిచయమైన కొన్ని రోజుల్లోనే వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఏర్పడింది. వారి లివిన్ రిలేషన్ లోనూ ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు. లండన్ లో గత నాలుగేళ్లుగా ఉంటున్నారు ఈ కపుల్స్. ఈ ఇద్దరూ ఇకపై ఎప్పటికీ కలిసుండాలని నిర్ణయించుకుని గురువారం అధికారికంగా దక్షిణ ఆఫ్రికాలో నిశ్చితార్థాం చేసుకున్నారు.

నువ్వు ఎప్పటికీ నాదానివే : వ్యాట్

ఈ సంతోషకరమైన విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్న ఉత్సాహంతో వీరిద్దరి ఎంగేజ్మెంట్ పిక్స్ ను తన ఇన్‏స్టాగ్రామ్, ట్విట్టర్ లో పోస్ట్ చేసింది డేనియల్. ఈ పిక్స్ కు జోడీగా “నువ్వు ఎప్పటికీ నాదానివే” అని క్యాప్షన్ ను జోడించింది. వారి జీవితాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిన ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తాజాగా డేనియల్ పెట్టిన ఈ ట్వీట్ కేప్ టౌన్ నుండి వచ్చింది. అంటే ICC మహిళల T20 ప్రపంచ కప్ 2023 తర్వాత డేనియల్ దక్షిణాఫ్రికాలోనే ఉందని తెలుస్తోంది.

వ్యాట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్ కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యింది. క్రికెటర్లు హర్లీన్ డియోల్, అలెగ్జాండ్రా హార్ట్లీ, సారా టేలర్, పూజా వస్త్రాకర్. అలనా కింగ్‌లతో సహా పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ జంటకు విషెస్ తెలిపారు.

డేనియల్ మంచి బౌలర్. 2010లో ఇంటర్నేషనల్ క్రికెట్‏లో అడుగుపెట్టింది. 13 ఏళ్లుగా డేనియల్ 99 వన్డేలు, 303 T20 మ్యాచులు ఆడింది. లీగ్ క్రికెట్‌లోనూ డేనియల్ భాగస్వామి అయ్యింది. సూపర్‌నోవా, మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ప్రాతినిధ్యం వహించింది.