Virat Kohli is the highest run scorer in T20 World Cup
mictv telugu

వరల్డ్ రికార్డ్స్ సాధించిన విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్

November 2, 2022

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రముఖ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ దెబ్బకు రికార్డులు దాసోహమవుతున్నాయి. ఇప్పటికే పలు రికార్డులు తన పేరున లిఖించుకున్న ఈ రన్ మెషీన్ తాజాగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో మరో అరుదైన రికార్డును సాధించాడు. పొట్టి ఫార్మాట్ ప్రపంచ కప్‌లలో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా అవతరించాడు.

బంగ్లాదేశ్‌తో బుధవారం జరుగుతున్న మ్యాచులో 16 పరుగులు చేయడం ద్వారా శ్రీలంక మాజీ ఆటగాడు మహేల జయవర్దనే 1016 ని అధిగమించి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచులో మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కి వచ్చిన భారత్.. ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ (2) వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. తొలుత నెమ్మదిగా బ్యాటింగ్ చేసినా.. తర్వాత కేఎల్ రాహుల్ విజృంభించి అర్ధ సెంచరీ చేసి ఔటయ్యాడు. క్రీజులో కోహ్లీ (29), సూర్య కుమార్ యాదవ్ (26) ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 12.4 ఓవర్లకు గాను 110/2 గా ఉంది. అటు టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య కుమార్ యాదవ్ అగ్రస్థానానికి ఎగబాకాడు. 2021లో టీ20లోకి వచ్చిన సూర్య.. అనతికాలంలోనే ఈ ఘనతను సాధించడం విశేషం.