ఎంత ప్రేమో.. భార్య కోసం కోహ్లి ఏంచేశాడంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎంత ప్రేమో.. భార్య కోసం కోహ్లి ఏంచేశాడంటే..

July 26, 2020

Virat Kohli Reveals he made cake for anushka sharma

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ తో సహా అన్ని రకాల క్రికెట్ మ్యాచ్ లు రద్దయిన సంగతి తెల్సిందే. దీంతో క్రికెటర్లు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉంటూ ఆఫ్‌ ఫీల్డ్‌ నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తన తనయుడికి గుర్రపు స్వారీ నేర్పిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

తాజాగా మయాంక్‌ అగర్వాల్‌ టీమిండియా సారథి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో లాక్ డౌన్ లో కొత్త పని ఏం నేర్చుకున్నావని కోహ్లీని అడిగాడు. అనుష్క శర్మ పుట్టిన రోజున తానే స్వయంగా కేక్‌ తయారు చేసినట్లు కోహ్లీ వెల్లడించాడు. కేక్‌ తయారుచేయడం తన జీవితంలో అదే మొదటిసారని తెలిపాడు. అదృష్టవశాత్తు మొదటి ప్రయత్నంలోనే కేక్‌ మంచిగా వచ్చినట్లు తెలిపాడు. అనుష్క శర్మ పుట్టిన రోజు మే 1 కావడంతో ఈఏడాది ఆమె పుట్టిన రోజున లాక్ డౌన్ అమల్లో ఉంది.