టీమిండియాకు కొత్త టెస్ట్ జెర్సీలు - MicTv.in - Telugu News
mictv telugu

టీమిండియాకు కొత్త టెస్ట్ జెర్సీలు

August 21, 2019

Virat Kohli, Rishabh Pant Pose In New Test Jerseys.

వెస్టిండీస్ పర్యటనలో వన్డే, టీ-20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు గురువారం నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌పై కన్నేసింది. టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. 

ఈ నేపథ్యంలో టీమిండియా టెస్ట్ జెర్సీలను మార్చేశారు. గురువారం వెస్టిండీస్‌తో ప్రారంభంకానున్న టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కొత్త జెర్సీల‌ను ధ‌రించ‌నుంది. ఇప్పటికే, కొత్త జెర్సీల‌ను ధ‌రించి కోహ్లీ సేన ఫోటోలకు ఫోజులిచింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక, టెస్టు క్రికెట్ కోసం స్పెషల్‌గా తయారు చేసించిన ఈ జెర్సీలు వైట్ కలర్‌లోనే ఉండగా.. ఆట‌గాళ్ల పేర్లతో పాటు జెర్సీ నెంబ‌ర్లు కూడా ఉంటాయి.