చొక్కా విప్పి పిచ్‌పైకి దూసుకొచ్చిన ఫ్యాన్..కోహ్లీ ఏంచేశాడంటే - MicTv.in - Telugu News
mictv telugu

చొక్కా విప్పి పిచ్‌పైకి దూసుకొచ్చిన ఫ్యాన్..కోహ్లీ ఏంచేశాడంటే

November 17, 2019

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. విరాట్ కోహ్లీ ఆడుతున్న మ్యాచ్ అంటే భారీ సంఖ్యలో అభిమానులు వస్తుంటారు. వాళ్ళను అదుపు చేయడం అంటే పోలీసులకు, సెక్యూరిటీ సిబ్బందికి పెద్ద తలనొప్పి. ఒక్కోసారి తమ అభిమాన ఆటగాడిని కలిసేందుకు ఫ్యాన్స్ బారికేడ్లను దూకేసి గ్రౌండ్‌లోకి పరుగులు తీస్తుంటారు. ఆటగాళ్ల కాళ్ళపై పడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా పరుగులు తీసే అభిమానులను పట్టుకొని సెక్యూరిటీ సిబ్బంది బయటకు బలవంతంగా తీసుకెళ్తుంటారు.  

తాజాగా అలాంటి సంఘటన ఒకటి ఇండియా-బాంగ్లాదేశ్ మధ్య జరిగిన ఇండోర్ టెస్ట్‌లో జరిగింది. ఉత్తరాఖండ్‌కు చెందిన సూరజ్ అనే అభిమాని బారీకేడ్ దూకేసి గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది సూరజ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కోహ్లీ ఆ అభిమానిని పెట్టుకోవద్దని చెప్పి, దగ్గరికి తీసుకొని భుజంపై చేయివేసి మాట్లాడాడు. అభిమాన క్రికెటర్‌తో మాట్లాడిన ఆ అభిమాని సంతోషంగా బయటకు వెళ్ళిపోయాడు. ఈ దృశ్యం మొత్తం ఎవరో కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.