లవర్ కోసం పాట పాడిన కోహ్లీ - MicTv.in - Telugu News
mictv telugu

లవర్ కోసం పాట పాడిన కోహ్లీ

December 12, 2017

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ప్రేయసి అనుష్కా శర్మను పెళ్లాడబోయే ముందు చక్కగా పాటపడి ఆమెను ప్లాట్ చేశాడు. బాలీవుడ్ హిట్ సాంగ్ ‘మెరే మెహబూబ్’ను ఆలపించాడు. ఇటలీలో పెళ్లాడిన ఈ జంట.. పెళ్లికి ముందు రోజు జరిగిన మందు పార్టీ ఈ ప్రేమగానానికి వేదికైంది.

అనుష్కను తలచుకుంటూ విరాట్ అలా పాడుతూ ఉంటే అందరూ మంత్రముగ్ధుల్లా వింటూ కూర్చున్నారు. మసక మసక వెలుతురు గదిలో చాలా రొమాంటిగ్గా పాడాడు ప్రియుడు. పాట ముగిశాక అనుష్కతోపాటు అక్కడున్న వారందరూ కెప్టెన్ ను చప్పట్లు కొట్టి అభినందించారు. ‘విరాట్.. నువ్వు ఇక ఆల్బమ్ చెయ్.. ’, ‘నీ జీఎస్టీ నంబర్ ఇవ్వు’ అని సంభాషణల్లో దొర్లాయి. తన పాట క్లిప్పును విరాట్ తన ట్విటర్ ఖాతాలో పడేశాడు… ఈ వీడియోను మీరూ చూడండి..

https://twitter.com/ViratCrew/status/940463800938938368