Virat Kohli slips out of top 10 of the ICC Test batting rankings for the first time since 2016
mictv telugu

టాప్-10 నుంచి కోహ్లీ అవుట్.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఉచిత సలహా

July 7, 2022

Virat Kohli slips out of top 10 of the ICC Test batting rankings for the first time since 2016

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. వరుసగా పేలవమైన ప్రదర్శనలు కనబర్చుతున్న కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అవుతోంది. అన్ని ఫార్మాట్ల‌లో అత్యుత్త‌మ బ్యాట‌ర్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ చాన్నాళ్ల నుంచి ప‌రుగులు చేయ‌డంలో ఇబ్బంది ప‌డుతున్నాడు. త‌న‌కెంతో ఇష్ట‌మైన టెస్టు ఫార్మాట్ లోనూ అత‌ను త‌డ‌బ‌డుతున్నాడు. రెండేళ్ల నుంచి ఒక్క సెంచ‌రీ కూడా కొట్టలేక‌పోయాడు. తాజాగా ఇంగ్లండ్ తో జ‌రిగిన ఐదో టెస్టులోనూ విరాట్ రెండు ఇన్నింగ్స్ ల్లో నిరాశ ప‌రిచాడు. ఈ వైఫ‌ల్యం అత‌ని ర్యాంక్‌పై ప్ర‌భావం చూపింది.

ఇక, లేటెస్ట్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ కింగ్ కోహ్లీ మరోసారి దిగజారిపోయాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్‌కు పడిపోయాడు. ఇటీవల ఇంగ్లండ్ తో బర్మింగ్ హామ్ లో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లోనూ కోహ్లీ రాణించింది లేదు. తొలి ఇన్నింగ్స్ లో 11, రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ కు టీమిండియా సమాయత్తమవుతోంది. నేడు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ టీ20 సిరీస్ లో గనుక రాణించకపోతే కోహ్లీ విషయంలో సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కోహ్లీ చాలా అవకాశాలు వృథా చేశాడన్న భావన నెలకొని ఉంది. ఈ టీ20 సిరీస్ లో రాణించడంపైనే టీ20 వరల్డ్ కప్ కు కోహ్లీ ఎంపిక ఆధారపడి ఉంది.

ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అయిన మైఖేల్ వాన్ కోహ్లీకి ఓ ఉచిత సలహా ఇచ్చాడు. ‘‘కోహ్లీకి ఐపీఎల్ తర్వాత కొంత విశ్రాంతి లభించింది. అయినా, అతడు మరి కొంత విశ్రాంతి కావాలన్నట్టు కనిపిస్తున్నాడు. క్రికెట్ నుంచి కనీసం మూడు నెలల విశ్రాంతి అతడికి అవసరం అనిపిస్తోంది. అందుకే వెళ్లి బెంచ్ పై కూర్చోవడం నయం. ‘వెళ్లి నీ కుటుంబంతో ఏమి చేయాలని అనకుంటున్నావో చేయి. 20 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో మూడు నెలల బ్రేక్ అతడికి నష్టం చేస్తుందా? అలాంటి అవకాశం లేదు. కానీ, ఈ బ్రేక్ అతడికి మేలు చేస్తుందా? అంటే చేస్తుందనే చెబుతాను’’ అని వాన్ పేర్కొన్నాడు.