బీచ్‌లో కండలు చూపిన టీమిండియా ఆటగాళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

బీచ్‌లో కండలు చూపిన టీమిండియా ఆటగాళ్లు

August 21, 2019

వెస్టిండీస్ పర్యటనలో బిజీబిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు ‘జాలీ’ బీచ్‌లో జాలీగా గడిపారు. బుధవారం నుంచి వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ మొదలుకానున్న నేపథ్యంలో టీం ఇండియా ఒత్తిడిని పక్కన పెట్టి బీచ్‌లో కొద్దిసేపు సరదాగా గడిపింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, ఇషాంత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, రిషభ్‌ పంత్‌, మయాంక్ అగర్వాల్‌ తదితరులు బీచ్‌లో సందడి చేశారు. 

దీనికి సంబంధించిన ఫోటోలను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..‘బీచ్‌లో ఆటగాళ్లతో ఇదో ఓ అద్భుతమైన రోజు’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20, వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రేపటి నుంచి ఆంటిగ్వాలో విండీస్‌తో మొదటి టెస్టును ఆడనుంది. ఈ సిరీస్‌తోనే ఇరుజట్లకు టెస్టు ఛాంపియన్‌షిప్‌ మొదలవ్వడంతో ఇది ఎంతో కీలకం కానుంది.