హైదరాబాద్‌లో టీ20..హాట్ కేకుల్లా టిక్కెట్ల అమ్మకం - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో టీ20..హాట్ కేకుల్లా టిక్కెట్ల అమ్మకం

December 4, 2019

Virat Kohli02

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌‌కి వేదిక కానుంది. ఈ నెల 6న ఇండియా-వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ టీ20 మ్యాచ్‌ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆన్‌లైన్‌తోపాటు టికెట్‌ విక్రయ కేంద్రాల్లో కూడా అభిమానులకు టిక్కెట్లు దొరకడం లేదు. అభిమానుల్లో క్రికెట్ క్రేజ్ చూసి టిక్కెట్లను బ్లాక్‌‌లో అమ్ముతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

కొందరు వ్యక్తులు ఆన్‌లైన్‌లో ముందుగానే పెద్దమొత్తంగా టికెట్లను బుక్‌ చేసుకొని మ్యాచ్‌ సమయానికల్లా వాటిని బ్లాక్‌లో విక్రయిస్తున్నారని అభిమానులు చెబుతున్నారు. బ్లాక్‌ టికెట్‌ దందాను అరికట్టాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శివం దూబే నగరానికి చేరుకున్నారు. ఈ సీరీస్ లో వెస్టిండీస్ క్రికెట్ జట్టుగా సారథిగా పోలార్డ్ వ్యవహరించనున్నాడు. వెస్టిండీస్ ఈ పర్యటనలో మూడు టీ20 మ్యాచ్ లు, 3 వన్డేలు ఆడనుంది.