Virat Kohli won the Player of the Month award
mictv telugu

బీజేపీ అభ్యర్థిని గెలిపించిన ఒవైసీ.. లెక్క పక్కా..

November 7, 2022

Virat Kohli won the Player of the Month award

వింతగా ఉన్నా పచ్చి నిజం. అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలో మస్లిస్ ఎ ముత్తెహాద్ ముస్లిమీన్(ఎంఐఎం) పార్టీ పుణ్యంతో బీజేపీ అభ్యర్థి ఓ అసెంబ్లీ సీటుకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన విజయంలో ఎంఐఎం కీలక పాత్ర పోషించింది. మత సెంటిమెంటుతో ముస్లింలు ఒవైసీ పార్టీ భారీగా ఓట్లేయడంతో బీజేపీ అభ్యర్థి విజయ దుందుభి మోగించారు.

బిహార్‌లోని గోపాల్‌గంజ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థి కుసుం దేవి ఆర్జేడీకి చెందిన సమీప ప్రత్యర్థిపై 1794 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. ఆర్జేడీకి సంప్రదాయంగా పడుతున్న ఓట్లు ఈసారి పడకపోవడమే దీనికి కారణం. ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన అబ్దుల్ సలాంకు ఏకంగా 12,214 ఓట్లు పడ్డాయి. అయితే ఆశించిన ప్రయోజనం నెరవేరకగా పోగా అవన్నీ ఓట్ల చీలికకు దారి తీసి కషాయం రెపరెపలాడింది. కుసుం దేవికి 70,053 ఓట్లు, ఆర్జేడీ అభ్యర్థి మోహన్ ప్రసాద్ గుప్తాకు 68,259 ఓట్లు ఓట్లు పడ్డాయి. ఒవైసీ పార్టీకి పడిన ఓట్లలో 1800 ఓట్లు ఆర్జేడీకి పడుంటే బీజేపీ గెలిచేది కాదు.

ఇదొక ట్విస్ట్ అయితే గోపాల్‌గంజ్‌లో ఆర్జేడీ అభ్యర్థికి ఇంటి పోరు మరో షాకిచ్చింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బామమరిది సాధు యాదవ్ భార్య ఇందిరా దేవి బీఎస్పీ తరఫున బరిలోకి దిగి 8954 ఓట్లు కొల్లగొట్టారు. బీజేపీ అభ్యర్థి సాధించిన ఆధిక్యానికి ఇవి ఐదింతలు. కర్ణుడి చావుకు వంద కారణాల్లా ఆర్జేడీ అభ్యర్థికి ఇలాంటి దెబ్బలు పడ్డాయి. ఈ నియోజకర్గంలోనే కాదు, పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేయడం వల్ల ఆ పార్టీ గెలవకపోగా వేరే పార్టీల ఓటు బ్యాంకు చీలి అసలుకే మోసం వస్తోంది. గెలిచన ఎమ్మెల్యలు కూడా కట్టు తప్పుతున్నారు. ఇదివరకు బిహార్లో ఐదుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో నలుగురు ఆర్జేడీ తీర్థం పుచ్చేసుకున్నారు.