ఆ అవార్డు కోహ్లీకే .. ఇచ్చి పడేసిన ఐసీసీ - MicTv.in - Telugu News
mictv telugu

ఆ అవార్డు కోహ్లీకే .. ఇచ్చి పడేసిన ఐసీసీ

November 7, 2022

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో సూపర్ ఫాంలో ఉన్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన ప్రతీ మ్యాచులో విరాట్ తన ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు అభిమానుల ప్రేమను కూడా గెలుచుకున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో ఎంత ఒత్తిడి ఉన్నా చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించిన విధానం మరింత ఆకట్టుకుంది.

ఆ మ్యాచులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాన్‌గా అవార్డు అందుకున్న విరాట్.. తాజాగా మరో అవార్డుకు ఎంపికయ్యాడు. ఐసీసీ ఇచ్చే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అక్టోబర్ నెల అవార్డును కోహ్లీ గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా, సౌతాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కూడా పోటీ పడ్డారు. కానీ, టైటిల్ మాత్రం విరాట్ ఎగరేసుకుపోయాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మహిళల విభాగంలో పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ నిదా దర్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. కాగా, గురువారం ఆడిలైడ్‌లో జరిగే సెమీస్ మ్యాచులో భారత్.. ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. ఈ పిచ్ స్పిన్నర్లుక అనుకూలిస్తుందని కోచ్ ద్రావిడ్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. సో.. ఆ మ్యాచులో స్పిన్నర్లదే హవా అని చెప్పవచ్చు.