డకౌట్లు..శాపాలు...ఓరినాయనో ఇవేం నమ్మకాలు...ఏ కాలం మనుషులు..! - MicTv.in - Telugu News
mictv telugu

డకౌట్లు..శాపాలు…ఓరినాయనో ఇవేం నమ్మకాలు…ఏ కాలం మనుషులు..!

June 10, 2017


కోహ్లీ డకౌట్ కు ఆమె కారణమట. ఏబీ డివిలియర్స్‌ డకౌట్ కూ ఆమే కారణమట. వీళ్లకు శాపం పెట్టిందా… అందుకే వీళ్లు డకౌట్ అయ్యారంట..క్రికెట్ కలికాలంలో శాపాలు ఏంటానుకుంటున్నారా…ఆశ్యర్యపోయినా నమ్మి తీరాల్సిన నిజాలు..వీటిని నమ్ముతున్నది మారుమూల పల్లెల్లో ఉన్న జనం కాదు…నెట్టింట్లో అస్తమానం గడిపే నెటిజన్లు.. ఎందుకిలా అంటే?

ఐసీసీ ఛాంపియన్‌షిప్ టోర్నమెంటులో భారత్, దక్షిణాఫ్రికా కెప్టెన్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌లను ఓ పాకిస్తానీ అమ్మాయి శాపం వెంటాడుతుందని నెటిజన్లు క్లిక్ కొట్టి మరి చెబుతున్నారు. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కి ముందు పాకిస్తాన్‌ స్పోర్ట్స్ ఎనలిస్టు జైనాబ్ దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ తో సెల్ఫీ దిగింది. అంతే…బౌలర్లకు చుక్కలు చూపించే సత్తా ఉన్న డివిలియర్స్ ఒక్కదెబ్బతో డకౌట్ అయ్యాడట. 12 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో అతడు డకౌట్ అవ్వడం ఇదే తొలిసారి. ఇక కోహ్లీ కథలోకి వస్తే… సరిగ్గా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు ఈమె విరాట్ కోహ్లీతో కూడా సెల్ఫీ దిగింది. అయితే ఆ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి 81 పరుగులు చేసిన కోహ్లీ… ఆ వెంటనే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.. ఈ ఇద్దరు కెప్టెన్లు డకౌట్ అయిన మ్యాచుల్లో సదరు రెండు జట్లూ ఓడిపోయాయి.ఈ రెండు సంఘటనలను పోల్చుతూ నెటిజన్లు ట్విటర్లో రెచ్చిపోతున్నారు.
అసలు ఇది ఏ కాలం..నమ్మేవాడికి ఏమన్న బుర్ర ఉందా. ఆటకు సెల్ఫీకి సంబంధం ఏంటీ. ఆమెతో సెల్ఫీ దిగినందుకే వాళ్లు డకౌట్ అయ్యారా..టీమ్ లో అందరి తో సెల్ఫీ దిగితే అందరూ డకౌట్ అవుతారా… అస్సలు పల్లెల్లో మూఢనమ్మకాలంటే ఏదో అనుకుంటాం..నెట్టింట్లో తెలివైనోళ్లు..తోపులు వీళ్లు ఏలా నమ్ముతున్నారు.? నమ్మడమే కాదు కామెంట్లతో ఎందుకు చెలరేగిపోతున్నారు..?కనీస కామన్ సెన్స్ ఉన్ననోళ్లు ఎవరైనా అరటి తొక్కకు ఆటకు లింకు పెట్టరు.
ఆటలో గెలుపొటములు సహజం..ఒక టీమ్ ఒడితేనే మరో టీమ్ విక్టరీ కొడుతోంది. ఒక బ్యాట్స్ మెన్ సెంచరీ చేస్తే మరో బ్యాట్స్ మెన్ డకౌట్ అవ్వొచ్చు.. ఇది ఆడే ప్లేయర్లను బట్టి ఉంటుంది. దీనికి శాపాలకు సంబంధం ఏంట్రాబాబు.
సరే ఈ కామెంట్లని లైట్ తీసుకుందాం.. ఫన్నీ గా నవ్వుతూ వదిలేయొచ్చు..సరదా కోసమే ఇలా అని ఎక్కడ ఎవరు రాయట్లేదు. అంటే శాపాలు, మూఢనమ్మకాలు నమ్ముతున్నారనే అనుకోవాలా.. ఏదేమైనా జైనాబ్ మాత్రం నెటిజన్ల కామెంట్లను లైట్ తీసుకుందట. ఇక పాకిస్తాన్ క్రికెట్ అభిమానులైతే… జైనాబ్ సెల్ఫీలపై తెగ ఖుషీ అవుతున్నారట. సెమీ ఫైనల్ బెర్త్ కోసం జరిగే పోరులో శ్రీలంక కెఫ్టెన్ తోనూ సెల్ఫీ దిగమంటున్నారటఎందో వీళ్లుూ…సెల్ఫీల పిచ్చి…