Virat Kohli : స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి అందమైన కూతురు కూడా ఉంది. ఈ జంట ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ జంట అని చెప్పి తీరాల్సిందే. ఈ జంట ఎక్కడ కనిపించినా ఒకరినొకరు ప్రశంసించుకుంటూ ఉంటారు. ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా వారి పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ తన భార్య అనుష్క శర్మ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నాడు. తల్లిగా ఆమె చేసిన త్యాగాల గురించి తెలియజేశాడు.
డానిష్ సైత్‌తో ఇటీవల జరిగిన ఆర్ సీబీ పోడ్‌కాస్ట్‌లో విరాట్ అనుష్క గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. 2021లో తమ కుమార్తె వామిక పుట్టిన తరువాత , అనుష్క భారీ త్యాగాలు చేసిందని విరాట్ తెలిపాడు. ’’గత రెండేళ్ళలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ఒక తల్లిగా, ఆమె చేసిన త్యాగం చాలా గొప్పది. ఆమె త్యాగాలు చూస్తే నాకు ఉన్న సమస్యలు చాలా చిన్నగా అనిపిస్తాయి‘‘ అని విరాట్ చెప్పాడు.
విరాట్ కొహ్లీకి భార్య అనుష్క శర్మ అంటే ఎంత ఇష్టమో ఈ ఒక్క మాటను బట్టి తెలుసుకోవచ్చు. సాధారణంగా ఏ భర్తా తన భార్య గొప్పతనం గురించి చెప్పడు. కానీ నిస్సందేహంగా విరాట్ తనకు స్ఫూర్తి తన భార్య అనుష్కేనని తెలిపాడు. జీవితం పట్ల అనుష్కకు ఉన్న దృక్పథం తనలోని మార్పుకు ప్రేరణ అందించాయన్నాడు. ప్రతీ విషయాన్ని ఆక్సెప్ట్ చేసే విధంగా నన్ను అనుష్క మలిచిందని తెలిపాడు.
‘‘మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని అనుకున్నప్పుడు మీరు మీ ఇంటి నుంచే ప్రారంభించాలి. మా ఇంట్లో అనుష్క నాకు పెద్ద ఇన్స్పిరేషన్ గా నిలిచింది. ఒకప్పుడు నా జీవితం పూర్తిగా భిన్నంగా ఉండేది, కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తితో ప్రేమలో పడిపోతామో మీలో మీకు తెలియకుండానే అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటి మార్పే నాలోనూ అనుష్క ద్వారా వచ్చాయి. అవి అందరూ ఆక్సెప్ట్ చేసేవే’’ ని పేర్కొన్నాడు.
అనుష్క శర్మ ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. ఈ బ్యూటీ నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. దాదాపు స్టార్ హీరోలందరితీ ఈ భామ నటించింది. అయితే విరాట్ తో ప్రేమ పెళ్లైన తరువాత తన సినీ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టింది ఈ చిన్నది. తన మ్యారేజ్ లైఫ్ కే అంకితం అయ్యింది. తన ప్రొఫెషన్ కన్నా ఫ్యామిలీ లైఫ్ కే అధిక ప్రాధాన్యతను ఇస్తుంది అనుష్క. అందుకే విరాట్ కు అనుష్క అంటే అంత ఇష్టం. భార్యగానే కాదు తల్లిగానూ అనుష్క ఎన్నో త్యాగాలు చేసిందన్నాడు విరాట్. అనుష్క శర్మ మాతృత్వ ప్రయాణం గురించి విరాట్ ఈ ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఓ తల్లిగా అనుష్కలో వచ్చిన పరివర్తన గురించి చాలా చక్కగా వివరించాడు. తల్లిగా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి అనుష్క ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ముందుకు నడిచిన విధానాన్ని చక్కగా వివరించాడు విరాట్. అనుష్క ట్రాన్స్ఫర్మేషన్ ను హైలెట్ చేస్తూ తన భార్య ఎదుర్కొన్న సవాళ్లల్లో ఐదో వంతు కూడా తాను ఎదుర్కోలేదని తెలియజేశాడు.