virat koholi birthday special 50 feet cutout in hyderabad
mictv telugu

కోహ్లీ భారీ కటౌట్..ధోనికి మించి

November 5, 2022

కెప్టెన్సీకి దూరం..ఫామ్ లేక తంటాలు..ఎన్నో విమర్శలు, ఆరోపణలు, అవమానాలు గత రెండు సంవత్సరాలుగా కింగ్ కోహ్లీ ఎదుర్కొన్న గడ్డుకాలం ఇది. ఇప్పుడు సీన్ మారిపోయింది. తనపై వస్తున్న విమర్శలకు, తన పని అయిపోయిందన్న వారందరికీ తన ఆటతోనే సమాధానం చెప్పాడు. తిట్టిన నోళ్లే.. పొగుడుతున్నాయి. అవమానించిన వారే..వారెవ్వా అంటున్నారు. ఫామ్ శాశ్వతం కాదు.. క్లాస్ మాత్రమే సొంతం అంటూ మరోసారి నిరూపించిన కోహ్లీ వరల్డ్ కప్లో అదరుగొడుతున్నాడు.పాత కోహ్లీని గుర్తు చేస్తూ టీం ఇండియాకు ఓంటి చేత్తో విజయాలనందిస్తున్నాడు. నేడు 34వ పుట్టిన రోజు జరుపుకుంటోన్న కోహ్లీకి క్రీడాకారులతో పాటు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా కోహ్లీ అభిమానులు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్ద పెద్ద కటౌట్లు, పాలభిషేకాలు, సేవా కార్యక్రమాలు చేస్తు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కోహ్లీ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ కటౌట్
అందరినీ ఆకర్షిస్తోంది. 50 అడుగుల భారీ కోహ్లీ కటౌట్ ను చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. ఈ కటౌట్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ధోని పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో 41 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేస్తే..ఇప్పుడు హైదరాబాద్ లో 50 అడుగుల కోహ్లీ కటౌట్ ఏర్పాటు చేయడం విశేషం