ధోనికి ఉండే క్లారిటీ కోహ్లీకి లేదు..సెహ్వాగ్ మండిపాటు - MicTv.in - Telugu News
mictv telugu

ధోనికి ఉండే క్లారిటీ కోహ్లీకి లేదు..సెహ్వాగ్ మండిపాటు

January 22, 2020

cbvhn

టీమిండియా మాజీ సారధి ధోనీపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. జట్టులోని ఆటగాళ్ల బ్యాటింగ్ స్థానాలపై ధోని పూర్తి క్లారిటీతో ఉండేవాడని సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు. ఆ అవగాహన ప్రస్తుత కెప్టెన్ కోహ్లీకి లేదన్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ స్థానాల్ని కోహ్లీ మార్చడంపై సెహ్వాగ్ మండిపడ్డాడు. ముంబైలో జరిగిన తొలి వన్డేలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన రాహుల్.. ఆ తర్వాత రాజ్‌కోట్ వన్డేలో ఐదో స్థానం, బెంగళూరు వన్డేలో ఓపెనర్‌గా వచ్చాడు.

దీంతో జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో గందరగోళం ఏర్పడటంతో పాటు ఆటగాళ్లు కూడా అభద్రతా భావానికి లోనయ్యే ప్రమాదం ఉందని సెహ్వాగ్ హెచ్చరించాడు. ఒక స్థానంలో ఆటగాడు విఫలమైతే? అతనికి మద్దతుగా నిలిచి మరికొన్ని అవకాశాలివ్వాలి తప్ప వెంటనే బ్యాటింగ్ స్థానాన్ని మార్చడం సరికాదని సెహ్వాగ్ సూచించాడు. నెం.5లో బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ ఓ నాలుగు సార్లు ఆ స్థానంలో విఫలమైతే? టీమిండియా మేనేజ్‌మెంట్ వెంటనే అతని స్థానాన్ని మార్చేస్తుంది. టీమ్‌లో గత మూడేళ్లుగా ఈ పంథా కొనసాగుతోంది. కానీ, ధోనీ సారధ్యంలో ఇలా ఉండేది కాదు. ఎందుకంటే? ఏ ఆటగాడు.. ఏ స్థానంలో ఆడగలడు? అనేదానిపై ధోనీకి అవగాహన ఉండేది. ఒకవేళ ఆ స్థానంలో క్రికెటర్ ఫెయిలైనా? ధోనీ మద్దతుగా నిలిచేవాడు తప్ప వెంటనే మార్చేవాడు కాదని సెహ్వాగ్ వెల్లడించాడు.