విశాఖలో పేలిన మందుపాతర.. ఇద్దరి మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖలో పేలిన మందుపాతర.. ఇద్దరి మృతి 

August 3, 2020

Visakha agency incident .

మావోయిస్టుల కదలికలు ఉన్నాయంటూ ఏజెన్సీలో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు విషాదం చోటుచేసుకుంది. మందుపాతర పేలడంతో ఇద్దరు గిరిజనులు చనిపోయారు. విశాఖ ఏజెన్సీలో పెదబయలు మండలం కోండ్రు అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

అయితే మందుపాతరను ఎవరు అమర్చారన్నది తెలియడం దు. పేలుడు ధాటికి  పెదబయలు మండలం చింతలవీధికి చెందిన మోహన్ రావు, అజయ్ కుమార్ అనే యువకులు చనిపోయారు. విశాఖ ఏజెన్సీలో కొన్నాళ్లుగా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు సాగుతున్నాయి. మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. గత నెల 19 పెదబయలు మండలం లండులు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. మూడు రోజుల క్రితం ఒడిశా సరిహద్దు వంతలగూడలోనూ ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. మావోయిస్టులు కాల్పులు జరుపుతూ ఒడిశాలోకి పారిపోయినట్లు చెబుతున్నారు.