విశాఖ ఎక్స్‌ప్రెస్.. బోగీలను వదిలి 20 కి.మీ వెళ్లిన ఇంజిన్  - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖ ఎక్స్‌ప్రెస్.. బోగీలను వదిలి 20 కి.మీ వెళ్లిన ఇంజిన్ 

August 19, 2019

Visakha Express

డ్రైవర్ల నిర్లక్ష్యంతో విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ఇంజన్ నర్సీపట్నం వద్ద బోగీలను వదలి 20 కిలోమీటర్ల వరకు ఇంజన్ ముందుకు వెళ్లింది. అయినా డ్రైవర్ చూసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రయాణికులను విస్తుబోయేలా చేస్తోంది. సోమవారం సాయంత్రం 4-30 గంటలకు విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్‌కు విశాఖ ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరింది. నక్కపల్లి నుంచి నర్సీపట్నం స్టేషన్ దాటి వెళ్లిపోయింది. ఇంజన్‌కు బోగీలకు మధ్య ఉన్న లింకు రాడ్‌లు, హీట్ ప్రెజర్ పైపులు  విరిగి‌ పోవడంతో ఇంజన్  నుండి భోగీ  వేరు పడింది.

ఈ సంగతి గమనించని రైల్వే డ్రైవర్ ఇంజన్ తీసుకుని అక్కడి నుండి దాదాపు 15 నుంచి 20 కిలో‌మీటర్ల వరకు వెళ్ళిపోయాడు. భోగీలో‌ఉన్న ప్రయాణికులు  ఎవరైనా చైన్ లాగి ఉంటారనుకుని చాలా సేపు అలానే వేచి ఉన్నారు. కాసేపటి తరువాత కొంత మంది బయటికి దిగి చూసేసరికి వారికి ఇంజన్ కనిపించలేదు. దీంతో షాక్ తిన్న ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు. ఆ వెంటనే తిరిగి రైలు బయలుదేరింది. దీంతో ప్రయాణికులు హమ్మయ్య అనుకున్నారు.