విశాఖపట్నంలోని మధురవాడలో పెళ్లి కూతురు మృతి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి . గన్నేరు పప్పు తిని నవ వధువు సృజన మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెళ్లి కూతురి బ్యాగ్లో గన్నేరు పప్పు దొరకడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే మనస్తాపంతోనే ఆమె గన్నేరు పప్పును తినిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. వధువు శరీరంలో పాయిజిన్ వున్నట్లు వైద్యులు చెప్పారని ఏసీపీ మీడియాకు తెలిపారు. పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు.
వధువు కుటుంబ సభ్యులతో పాటు.. వరుడి కుటుంబ సభ్యులతో పోలీసులు మాట్లాడారు. సృజన మృతిపై ఇరు కుటుంబాల పేరెంట్స్ ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. వధువకు ఇష్టపూర్వకంగానే పెళ్లి జరుగుతోందని పేరంట్స్ చేప్తున్నారు. మరి అలాంటప్పుడు చనిపోవాల్సిన అవసరం సృజనకు ఏంటనేదే ఎవరికీ అంతుపట్టడం లేదు. అంతకుముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్లో కూడా వధూవరులు ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. పెళ్లికి సంబంధించిన పనుల్లోనూ చాలా ఉల్లాసంగా కనిపించారు. కానీ ఇలా పెళ్లి పీటల మీదకు రాగానే.. సడెన్గా ప్రాణాలు కోల్పోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.