విశాఖ క్రేన్ బీభత్సం.. ఇప్పటికి 10 మంది మృతి..  - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖ క్రేన్ బీభత్సం.. ఇప్పటికి 10 మంది మృతి.. 

August 1, 2020

Visakhapatnam shipyaed crane accident

విశాఖపట్నం షిప్‌యార్డ్ ఉదంతం ఇటీవల ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘోరాన్ని తలపిస్తోంది. క్రేన్ విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుంది. ఈ వార్త రాసే సమయానికి మృతుల సంఖ్య పదికి చేరింది. ప్రమాదం ఎలా జరిగిందో తమకే అర్థం కావడం లేదని  హిందూస్థాన్‌ షిప్‌‌యార్డులోని సిబ్బంది చెబుతున్నారు. అయితే క్రేన్ నిర్వహణను ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చారని, లోపాలను సకాలంలో గుర్తించలేదని ఆరోపణలు వస్తున్నాయి. తనిఖీ సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రాణనష్టం జరిగేది కాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

‘యార్డులో కంటైనర్లలో లోడింగ్‌ పనులు  సాగుతున్నాయి క్రేన్‌ను తనిఖీ చేయగా అది మొరాయించింది. ఎక్కడైనా వైరింగ్, ఇతర లోపాలేవన్నా ఉన్నాయా అని కార్మికులు తనిఖీ చేశారు. క్రేన్ ఒక్కసారిగా వారిపై కూలిపోయింది. కార్మికులు తప్పించుకోడానికి వీల్లేకుండా పోయింది’ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రమాద సమయంలో క్రేన్ కింద 20 మంది ఉన్నారని, ప్రాణాలతో బయటిపడిన వారికి తీవ్రగాయాలయ్యాయని వెల్లడించారు.