విశాఖలో మళ్లీ గ్యాస్ లీక్.. నలుగురు అపస్మారకంలోకి..
స్టైరిన్ గ్యాస్ లీక్ బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆల్ ఈజ్ వెల్ అని నాయకులు చెబుతున్న వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. విశాఖపట్నంలోని ఆర్ ఆర్ వెంకటాపురంలో ఈ రోజు మధ్యహ్నం మళ్లీ గ్యాస్ లీకైంది. ఎల్జీ పారిమర్స్ పరిశ్రమలోని ట్యాంకుల నుంచి స్టైరిన్ బయటకి రావడంతో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో వీఆర్ఓ తులసి కూడా ఉణ్నారు. వారిని హుటాహుటిన గోపాలపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్టైరిన్ నిల్వలను ఘనపదార్థంగా మార్చి ఈ రోజు నుంచి దక్షిణ కొరియాకు తరలిస్తున్నారు. గుర్తించని లోపాల వల్ల గ్యాస్ పలుమార్లు లీక్ అవుతోంది. అక్కడ విషవాయువు ఆనవాళ్లు లేవని ప్రభుత్వం చెబుతున్నా.. జనం మాత్రం ఇలా కళ్లుతిరిగి, కడుపు దేవి పడిపోతూనే ఉన్నారు. స్టైరిన్ గ్యాస్ లీక్ తో 12 మంది మృత్యువాతపడగా, వందలమంది అస్వస్థకు గురవడం తెలిసిందే.