రాజధాని ఎఫెక్ట్.. విశాఖ భూముల ధరలు 50% పెంపు - MicTv.in - Telugu News
mictv telugu

రాజధాని ఎఫెక్ట్.. విశాఖ భూముల ధరలు 50% పెంపు

August 1, 2020

Visakhapatnam's land rates change after Governor's 'capital' nod

జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ శుక్రవారం ఆమోద ముద్ర వేసిన సంగతి తెల్సిందే. గవర్నర్ నిర్ణయంతో విశాఖపట్నం పాలనా రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూల్ న్యాయ రాజధానిగా ఏర్పడడానికి మార్గం సుగమం అయింది. దీంతో పాలనా రాజధాని విశాఖపట్నంలో భూములకు రెక్కలు వచ్చాయి. అక్కడి భూముల విలువను పెంచుతూ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

విశాఖ జిల్లాలో గరిష్టంగా 50 శాతం, కనిష్టంగా 5 శాతం భూముల విలువను పెంచేందుకు అధికారులు ప్రతిపాదించారు. రియల్ ఎస్టేట్ భూములతో పాటు వ్యవసాయ భూముల ధరలు కూడా పెరుగనున్నాయి. భీమిలి ప్రాంతంలోని వ్యవసాయ భూములను 50 శాతం, ముడసర్లోవ ప్రాంతంలో 27 శాతం పెంచనున్నారు. ఈరోజు నుంచి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి… 10వ తేదీ నుంచి కొత్త విలువను అమలు చేయనున్నారు. పెరిగిన విలువతో భీమిలిలో ఎకరం భూమి ధర రూ. 3 కోట్లకు చేరనుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.