విశాఖలో వింతచేప.. మత్స్యకన్యే అంటున్న జనం! - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖలో వింతచేప.. మత్స్యకన్యే అంటున్న జనం!

December 15, 2017

ఇటీవల విశాఖపట్నంలో గ్రహాంతరవాసులు కనిపించారని వార్తలు రావడం తెలిసిందే. అయితే అవి గుడ్లగూబ జాతికి చెందిన జీలుగు పక్షులని అటవీ శాఖ అధికారులు తేల్చారు. తాజాగా విశాఖలో మరో వింత చోటుచేసుకుంది. ముఖం తప్ప.. అచ్చం మనిషిని పోలిన వింత చేప బయటపడిందని వార్తలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇది ముమ్మాటికీ మత్య్సకన్యే అని కొందరు, నరసింహావతారం మాదిరి నరమత్స్యం అని కొందరుఅంటున్నారు.

విశాఖ తీరంలో జాలర్లకు వలలో ఈ వింత జీవి దొరికిందని చెబుతున్నారు. పొట్ట, వక్షాలు, చేతులు.. మనిషి పోలి ఉన్నాయి. చేతులను వెనక్కి తిప్పి కట్టేసినట్లు  ఉన్నాయి. ఈ  చేప ఇంకా శ్వాసతీసుకుంటూ ఉండడం వల్ల ఇంకా బతికే ఉన్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.  అయితే ఇది కచ్చింతగా విశాఖలోనే దొరికిందా లేకపోతే ఎక్కడి వీడియోనే తీసుకొచ్చి విశాఖకు లింకు పెట్టి ప్రచారం చేస్తున్నారా అన్నది తెలియడం లేదు.