Vishal collapsed while shooting of lothy movie
mictv telugu

షూటింగ్‌లో కుప్పకూలిన విశాల్.. వీడియో

July 5, 2022

Vishal collapsed while shooting of lothy movie

సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసే హీరోలలో విశాల్ ఒకరు. సీన్ బాగా రావడానికి ఎంత కష్టమైనా భరిస్తాడని ఇండస్ట్రీలో ఆయనకు పేరుంది. ఈ క్రమంలో ఎన్నో సార్లు గాయాలపాలయ్యారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న లాఠీ చిత్రం షూటింగులో విశాల్ మరోసారి గాయపడ్డారు.

పోలీస్ డ్రెస్సులో హీరో ఇంట్రడక్షన్ పోరాట దృష్యాలు చిత్రీకరిస్తుండగా, ఉన్నట్టుండి విశాల్ కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే స్పందించిన యూనిట్ సిబ్బంది విశాల్‌ను చేరుకొని సపర్యలు చేసింది. అనంతరం ఎడమ కాలికి గాయమైనట్టుగా గుర్తించారు. కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన తిరిగి షూటింగులో పాల్గొన్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే సినిమా షూటింగులో విశాల్ గాయపడ్డాడు. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ చిత్రంలో విశాల్ సరసన సునయన కథానాయికగా నటిస్తోంది. ఎ. వినోద్ కుమార్ దర్శకుడు కాగా, సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.