విశాల్ నిజజీవితంలో విలన్..మాజీ ఉద్యోగిని ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

విశాల్ నిజజీవితంలో విలన్..మాజీ ఉద్యోగిని ఫైర్

July 7, 2020

nbjh

తమిళ నటుడు విశాల్ తన నిర్మాణ సంస్థ అయిన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ మాజీ ఉద్యోగిని రమ్య దాదాపు రూ. 45 లక్షలు కాజేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రమ్య ఆ సంస్థలో ఆరేళ్ళు పనిచేసింది. దీనిపై రమ్య ఘాటుగా స్పందించింది. ‘పైకి హీరోలా కనిపించే విశాల్, వాస్తవానికి పెద్ద విలన్. దీనికి సంబంధించిన ఎన్నో ఆధారాలు నా దగ్గర ఉన్నాయి.’ అని ఆమె తెలిపింది.

 ‘నా వద్ద ఉన్న వివరాలన్నీ చెబితే, విశాల్ నిజస్వరూపం బయట పడుతుంది. నేను ఎవరినీ మోసం చేయలేదు. మహిళను కావడం వల్లే నన్ను బెదిరిస్తున్నారు. నేను ఇంతకాలమూ ఎంతో సైలెంట్ గా ఉన్నాను. కానీ, ఇప్పుడు నాపైనే ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతాను. దాంతో విశాల్ విషయం అందరికీ తెలుస్తుంది.’ అని ఆమె ఆమె మీడియాకు తెలిపారు. ఈ వివాదం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.