విశాల్ నామినేషన్‌ తిరస్కరణ వెనుక.. - MicTv.in - Telugu News
mictv telugu

విశాల్ నామినేషన్‌ తిరస్కరణ వెనుక..

December 6, 2017

ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ కోసం తమిళ నటుడు, తెలుగు యువకుడు  విశాల్ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురికావడం వెనుక పెద్ద రాజకీయాలే నడిచినట్టు తెలుస్తోంది. ఆడవాళ్ల కిడ్నాప్, హత్యా బెదిరింపులు, భారీగా లంచం.. మొత్తం సినిమా సీన్లను తలపించేలా సాగింది వ్యవహారం.

విశాల్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించినవారిలో సుమతి,  దీపన్ లు తర్వాత మాట మార్చారు. నామినేషన్ పత్రాల్లో తాము సంతకాలు చేయలేదని, అందులో ఉన్న తమ సంతకాలు నకిలీవి అని అన్నారు. దీంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్ ను తిరస్కరించారు. అయితే అన్నాడీఎంకే అభ్యర్థి మదుసూదన్..  సుమతి, దీపన్లను చంపుతామని బెదిరించాడని, అందుకు వాళ్లు మాట మార్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమతి భర్త వేలుకు, విశాల్‌కు మధ్య సాగినన ఫోన్ సంభాషణలో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. విశాల్ ఈ ఆడియోను ఈసీకి పంపాడు. అయితే ఇది నిజమైందో కాదో తమకు తెలియదని ఈసీ అంటోంది.

తమ ఇంట్లోని ఆడవాళ్లను మధుసూదన్ మనుషులు బెదిరించడంతో.. సుమతి సంతకం తనది కాదని చెప్పిందని వేలు.. విశాల్‌తో చెబుతున్నట్లు ఆడియోలో ఉంది. సుమతిని, ఆమె కుటుంబంలోని ఇతర మహిళలను మధుసూదన్ మనుషులు కిడ్నాప్ చేశారని, వాళ్లు చెప్పమన్నట్లు చెప్పాలని బలవంతం చేశారని వేలు తెలిపాడు. ఇందు తమకు భారీగా డబ్బులిచ్చారని వెల్లడించాడు. ప్రాణభయంతోనే సుమతి.. ఆ సంతకం తనది కాదని రిటర్నింగ్ అధికారికి చెప్పిందన్నారు.