విశాల్‌ను బలపరచిన వారిని కిడ్నాప్ చేశారు! - MicTv.in - Telugu News
mictv telugu

విశాల్‌ను బలపరచిన వారిని కిడ్నాప్ చేశారు!

December 8, 2017

వివాదాస్పదంగా మారిన తమిళనాడు ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక అచ్చం సినిమా సీన్లను తలపిస్తోంది. నటుడు, తెలుగు యువకుడు విశాల్‌ నామినేషన్‌ను ఈసీ తిరస్కరించడం తెలిసిందే. ఆయన నామినేషన్ పత్రాలపై సంతకం చేసిన దీపన్, సుమతి అనే వ్యక్తులు తర్వాత ఆ సంతకాలు తమవి కావని చెప్పడంతో ఈసీ నామినేషన్‌ను తిరస్కరించారు.

ఈ నేపథ్యంలో దీపన్‌, సుమతి కనిపించకుండా పోయారు. వారిని అన్నాడేఎంకే అభ్యర్థి మధుసూదన్ మనుషులు కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. మధుసూదన్ చంపుతామని బెదరించడం వల్లే సంతకం తనది కాదని సుమతి చెప్పినట్లు ఆమె భర్త వేలు వెల్లడించడం తెలిసిందే.

నిజాలు బయటికి రాకుండా ఉండటానికి మధుసూదన్ గ్యాంగు.. దీపన్, సుమతిలను కిడ్నాప్ చేసి దాచి ఉంటుందని భావిస్తున్నారు. వీరికి, వీరి కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, వెంటనే పోలీసులు వీరిని కాపాడాలని విశాల్ డిమాండ్ చేశాడు. సుమతి నిన్నటి నుంచి కనిపించకుండాపోవడంతో కుటుంబం భయాందోళనకు గురువుతోంది. దీపన్‌ కుటుంబం కూడా ఈ విషయంలో అసలు మీడియా ముందుకు రావడానికే భయపడుతోంది. తమను ఇబ్బంది పెట్టొద్దని చెబుతోంది. కాగా, విశాల్ నామినేషన్ తిరస్కరణ వెనుకు పెద్ద కుట్ర ఉందని అన్నాడీఎంకే నేత స్టాలిన్ ఆరోపించారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానానికి ఈ నెల 21న ఉప ఎన్నిక జరగనుంది.