ఇన్ఫోసిస్  సీఈఓ విశాల్ సిక్కా ఔట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇన్ఫోసిస్  సీఈఓ విశాల్ సిక్కా ఔట్

August 18, 2017

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నాయకత్వం లో విభేదాలు భగ్గుమన్నాయి. సంస్థ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ సిక్కా పదవుల నుంచి తప్పుకున్నారు.  దీంతో ఆయనను యాజమాన్యం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా నియమించింది. తాత్కాలిక ఎండీ, సీఈఓగా యూబీ ప్రవీణ్ రాయ్ నియమితులయ్యారు. మూడేళ్ల కిందట సీఈఓ, ఎండీ బాధ్యతలు చేపట్టిన సిక్కా విధాన నిర్ణయాలపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.  అభిప్రాయ భేదాల వల్లే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన కంపెనీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది.  మూడేళ్లుగా కొంత ప్రగతి సాధించినప్పటికీ నాపై వ్యక్తిగత ఆరోపణలు తీవ్రమయ్యాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు.  ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో సిక్కా అస్త్రసన్యాసం చేయడం విశేషం.

కొత్తగా సారథ్యం వహించనున్న ప్రవీణ్ 1986లో కంపెనీలో చేరారు. ప్రస్తుతం యన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఆర్థిక, పాలనాపరమైన అస్తవ్యస్థత, కంపెనీకి పాశ్చాత దేశాల క్లయింట్లు తగ్గుతున్న నేపథ్యంలో సమస్యలు చక్కదిద్దుకోవాల్సిన యాజమాన్యం తాత్సారం చేస్తోంది. కంపెనీలో పాలన సరిగ్గా లేదని వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి ఇదివరకే మండిపడ్డారు.