Vishal's film Mark Antony had an accident while shooting
mictv telugu

విశాల్ సినిమా సెట్‌లో ప్రమాదం.. వీడియో

February 22, 2023

Vishal's film Mark Antony had an accident while shooting

తెలుగు హీరో అయిన విశాల్ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా లాఠీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ సారి రా అండ్ రస్ట్ యాక్షన్ ఫిల్మ్‌ని రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మార్క్ అంటోనీ చిత్రంలోని విశాల్ లుక్‌ని శివరాత్రి రోజు రిలీజ్ చేయగా గుబురు గడ్డం, చేతిలో తుపాకీతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేదిగా ఉంది. రీతూ వర్మ హీరోయిన్‌గా, సునీల్ విలన్ తరహా పాత్ర చేస్తున్న ఈ సినిమా షూటింగులో ప్రమాదం చోటు చేసుకుంది. యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తుండగా, ఓ భారీ వాహనం గోడని బద్ధలు కొట్టి లోపలికి రావాల్సి ఉంది.

అయితే గోడను ఢీకొట్టిన తర్వాత వాహనం అదుపుతప్పి అక్కడున్న ఆర్టిస్టులపై దూసుకెళ్లడంతో వారు అప్రమత్తమయ్యారు. అందరూ తప్పించుకోవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ఈ ప్రమాద ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ అవుతోంది. కాగా, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మార్క్ అంటోనీ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఎస్‌జే సూర్య, అభినయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.